OnePlus Nord CE 3 Lite 5G Price Cut: ఇది మాములు ఆఫర్‌ కాదు..Nord CE 3 Lite మొబైల్‌పై రూ.18,950 తగ్గింపు..

OnePlus Nord CE 3 Lite 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అమెజాన్‌ ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. అలాగే దీనిపై బ్యాంక్‌ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 8, 2024, 03:07 PM IST
OnePlus Nord CE 3 Lite 5G Price Cut: ఇది మాములు ఆఫర్‌ కాదు..Nord CE 3 Lite మొబైల్‌పై రూ.18,950 తగ్గింపు..

OnePlus Nord CE 3 Lite 5G Price Cut: వన్‌ప్లస్‌ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి అమెజాన్‌ ప్రత్యేకమైన సేల్‌ను అందిస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన కొన్ని వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. గత ఏడాది మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన OnePlus Nord CE 3 Lite 5G మొబైల్‌ ప్రత్యేక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా అమెజాన్‌ ప్లాట్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఇతర ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, రెండవది 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం 8GB RAM, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన స్మార్ట్‌ఫోర్‌ MRP ధర రూ.21,999తో అందుబాటులో ఉంది. అయితే అమెజాన్‌ సాధరణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని OnePlus Nord CE 3 Lite 5G మొబైల్‌పై 9 శాతం తగ్గింపుతో రూ.19,999కే అందిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనపు తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, OnePlus Nord CE 3 Lite 5G మొబైల్‌ను ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా OneCard, HSBC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,200 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.18,950 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,049కే పొందవచ్చు. 

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
స్మూత్ డిస్‌ప్లే: ఈ OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేని కలిగి ఉంటుంది. గేమ్‌లు ఆడేటప్పుడు లేదా స్క్రోలింగ్ చేసేటప్పుడు మంచి అనుభవాన్ని పొందుతారు.

64MP కెమెరా: ఈ స్మార్ట్‌ఫోన్‌ 64MP ప్రధాన కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.  అందమైన ల్యాండ్‌స్కేప్‌లు, క్లోజ్-అప్ షాట్‌లు లేదా తక్కువ లైటింగ్ ఉన్న పరిస్థితుల్లో కూడా ఫోటోలు తీయడానికి ఇది బాగుంటుంది.

బలమైన బ్యాటరీ:  5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఇది ఒక్కసారి చార్జ్‌ చేస్తే రోజంతా వినియోగించవచ్చు.  అలాగే ఇది ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. 

Android 13: ఇది OnePlus Nord CE 3 Lite 5G మొబైల్‌ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. 

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News