OnePlus Nord CE 3 5G: అమెజాన్‌లో సడెన్‌గా తగ్గిన OnePlus Nord CE 3 5G మొబైల్‌ ధర..ఎగబడి కొంటున్న జనాలు!

OnePlus Nord CE 3 5G Sudden Price Down: అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్(Amazon Fab Phones Fest)లో భాగంగా OnePlus Nord CE 3 5G మొబైల్‌ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2024, 12:07 PM IST
OnePlus Nord CE 3 5G: అమెజాన్‌లో సడెన్‌గా తగ్గిన OnePlus Nord CE 3 5G మొబైల్‌ ధర..ఎగబడి కొంటున్న జనాలు!

OnePlus Nord CE 3 5G Sudden Price Down: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ (Amazon Fab Phones Fest) ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని కంపెనీలకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. అమెజాన్‌లో ఈ సేల్‌  ఫిబ్రవరి 10న ప్రారంభమైంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్..అమెజాన్‌ అందిస్తున్న ఈ సేల్‌లో OnePlus Nord CE 3 5G భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

8GB ర్యామ్‌ వేరియంట్‌పై బంఫర్‌ ఆఫర్‌:
ప్రస్తుతం అమెజాన్‌లో OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్‌  8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్ అసలు ధర రూ.24,999తో అందుబాటులో ఉంది. ఇక రెండవ వేరియంట్‌ విషయానికొస్తే.. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో రూ. 27,999కి  లభిస్తోంది. అయితే అమెజాన్‌ ఈ రెండు వేరియంట్స్‌పై దాదాపు రూ.1,000 వరకు ప్రత్యేకమైన కూపన్స్‌ను అందిస్తోంది. దీంతో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

బ్యాంక్‌ ఆఫర్స్‌:
అమెజాన్‌లో OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ మొబైల్‌ను ICICI బ్యాంక్‌, OneCard, Citibank, HSBC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్స్‌ 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌పై అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ బ్యాంక్‌ ఆఫర్స్‌ అన్ని పోను రూ.22,999కే పొందవచ్చు. దీంతో పాటు అమెజాన్‌ అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ. 23,650 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను రూ.1,349 పొందవచ్చు.  
 Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?  
ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:

6.72 అంగుళాల AMOLED డిస్ప్లే
120 Hz రిఫ్రెష్ రేట్ 
950 nits పీక్ బ్రైట్‌నెస్
Qualcomm Snapdragon 782G ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ OS 13.1
50 మెగాపిక్సెల్ సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్
8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్
2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్
80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
5000mAh బ్యాటరీ
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్
5G సపోర్ట్
బ్లూటూత్ 5.2

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News