Oneplus Nord CE 3 5G Price Cut: అమెజాన్‌లో 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ Nord CE 3 5G మొబైల్‌పై రూ.18,950 తగ్గింపు..

Oneplus Nord CE 3 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన వన్‌ప్లస్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అమెజాన్‌ కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేమైన డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. అయితే ఇటీవలే లాంచ్‌ అయిన Oneplus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 9, 2024, 11:54 AM IST
Oneplus Nord CE 3 5G Price Cut: అమెజాన్‌లో 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ Nord CE 3 5G మొబైల్‌పై రూ.18,950 తగ్గింపు..

Oneplus Nord CE 3 5G Price Cut: హై మోగాపిక్సెల్ కలిగిన మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ అతి తక్కువ ధరలోనే లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఇటీవలే 108MP ప్రధాన కెమెరాతో లాంచ్‌ అయిన Oneplus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. తక్కువ ధరలో లభించడంతో యువత కూడా ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఇది అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. అలాగే దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
  
అమెజాన్‌లో ఈ మొబైల్‌ మొత్తం రెండు కలర్స్‌, రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగిన దీని ధర MRP రూ.21,999తో లభిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ Oneplus Nord CE 3 5G మొబైల్‌ ప్రత్యేక డీల్ నడుస్తోంది. ఈ డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 9 శాతం డిస్కౌంట్‌తో రూ.19,999కే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా డిస్కౌంట్‌ పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌, OneCard క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,250 వరకు తగ్గింపు లభిస్తుంది. 

అలాగే ఈ Oneplus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా తగ్గింపు పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ బోనస్‌ కూడా పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించడానికి మీరు వినియోగిస్తున్న కండీషన్‌ కలిగిన పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.18,950 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ కేవలం రూ.1,049కే పొందవచ్చు. 
 
ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:

OxygenOS 13.1 with Android 13 ఆపరేటింగ్ సిస్టమ్
Qualcomm Snapdragon 695 ప్రాసెసర్
8GB ర్యామ్‌, 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్
త్రిపుల్‌ కెమెరా సెటప్‌
108MP బ్యాక్‌ ప్రధాన కెమెరా
2MP (depth) + 2MP (macro) కెమెరాలు
16MP ముందు కెమెరా
5000mAh బ్యాటరీ (Battery)
67W ఫాస్ట్ చార్జింగ్ (Fast Charging)
6.72-inch LCD డిస్ప్లే (Display)

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

హైలైట్స్‌:
5G కనెక్టివిటీ: వేగవంతమైన డౌన్‌లోడ్ స్పీడ్‌, తక్కువ లేటెన్సీతో అధునాతన్ 5G నెట్‌వర్క్‌లకు కనెక్టింగ్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది.
120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే: అత్యంత సున్నితమైన, ప్రీమియం అనుభవాన్ని అందించే డిస్ల్పేను కలిగి ఉంటుంది.
108MP ప్రధాన కెమెరా: అద్భుతమైన అధిక-రిజుల్యూషన్ ఫోటోలు తీయడానికి సపోర్ట్‌ను అందిచే 108MP ప్రధాన కెమెరాతో లభిస్తోంది. 
67W ఫాస్ట్ చార్జింగ్: వేగంగా ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి సపోర్ట్‌ను అందించే 67W ఫాస్ట్ చార్జింగ్..

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News