Maruti Swift 2025 Model: ఇటీవల జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో భాగంగా మారుతి అనేక కొత్త కార్లను పరిచయం చేసింది. కానీ ఆప్డేట్ 2025 కారును మాత్రం సీక్రెట్‌గా ఉంచింది. కానీ ఇటీవలే ఈ స్విఫ్ట్ కారుకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కారు టెస్టింగ్‌లో భాగంగా ఇటీవలే రోడ్లపై కనిపించింది. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ స్విఫ్ట్ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్విఫ్ట్ కారు ఫ్రంట్ భాగంలో హైబ్రిడ్ లోగోను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ కారులో స్పెషల్ ADAS సూట్ కూడా లభిస్తోంది. అలాగే ఈ కారు స్పెషల్ కలర్ ఆప్షన్స్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్విఫ్ట్ హైబ్రిడ్ స్పోర్టీ లుక్‌తో విడుదల కానుంది. అలాగే దీని ఫ్రంట్ బంపర్ సిల్వర్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. మారుతి కంపెనీ ఈ కారులో విజువల్ బల్క్‌ను తగ్గించేందుకు స్పెషల్ బ్లాక్ ఎలిమెంట్‌లను కూడా కలిగి ఉండబోతున్నట్లు కూడా తెలుస్తోంది. దీని ఫ్రంట్ భాగంలో ఉండే గ్రిల్‌పై రాడార్ మాడ్యూల్ కూడా లభిస్తోంది. దీని ద్వారా కారు మరింత ఆకర్శనీయంగా కనిపిస్తుంది.
కొత్త స్విఫ్ట్ స్పెషల్ అల్లాయ్ వీల్ డిజైన్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా బ్యాక్ సైడ్‌లో డిస్క్ బ్రేక్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. గత మోడల్ కంటే ఈ కారులో ప్రత్యేకమైన ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి. జపనీస్-స్పెక్ మోడల్ ADAS ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణీకుల భద్రతను మరింత పెంచేందుకు స్పెషల్ సెక్యూరుటీ ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే స్పెషల్ యాడ్-ఆన్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ సిస్టమ్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ కారులో CVT గేర్‌బాక్స్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కారు స్పెషల్ మోడల్‌లో హైబ్రిడ్ 1.2L Z12E పవర్‌ట్రెయిన్‌ను కూడా అందిస్తోంది.
స్విఫ్ట్ హైబ్రిడ్ గతంలో విడుదల చేసిన మోడల్ కంటే ఎక్కువ మైలేజీని అందించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ లీటర్‌కు 24.5 కిమీ పైగా మైలేజీని అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో వివిధ మోడల్స్ వివిధ రకాలుగా మైలేజీని అందిస్తుంది. అయితే ఈ మోడల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter