Iphone 17 Series: ఐఫోన్ లవర్స్‌కి బంఫర్ గుడ్ న్యూస్.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐఫోన్ సెప్టెంబర్ నెలలో మరో కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఇది గత 16 మోడల్‌కి ఆప్డేట్ వేరియంట్‌లో iPhone 17 సిరీస్ పేరుతో విడుదల చేయబోతోంది. ఈ iPhone 17 సిరీస్ ప్రీమియం ఫీచర్స్‌తో అద్భుతమైన డిజైన్‌తో లాంచ్ కాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అధికారికంగా త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ iPhone 17 సిరీస్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఐఫోన్ 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో బేస్ వేరియంట్ ఐఫోన్ 17 పేరుతో లాంచ్ అయితే.. హై ఎండ్ వేరియంట్స్ ఐఫోన్ 17 ప్రో, మ్యాక్స్ పేర్లలతో విడుదల చేయనుంది. ఇటీవలే లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ iPhone 17 సిరీస్‌లో ఈసారి కెమెరా మాడ్యూల్‌లో పెద్ద మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది గతంలో కెమెరా కంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది. హై ఎండ్ వేరియంట్స్‌కి కంపెనీ మూడు కెమెరా సెన్సార్స్‌ను అందించనుంది.
ఇటీవలే ఈ యాపిల్ సిరీస్‌కి సంబంధించిన కెమెరా మాడ్యూల్ వివరాలను టిప్‌స్టర్ మజిన్ బు (@MajinBuOfficial) లీక్ చేశారు. ఈసారి విడుదల కాబోయే ఐఫోన్ 17 డిజైన్ గూగుల్ పిక్సెల్ మాదిరిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బేస్ వేరియంట్‌లో నిలువు కెమెరాను అందించబోతోంది. అలాగే ప్రత్యేకమైన కెమెరా సెనార్స్‌ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్స్ వెల్లడించారు. అంతేకాకుండా ఈ యాపిల్ 17 సిరీస్‌లోని బేస్ వేరియంట్ కూడా చాలా బాగుండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ ఐఫోన్ 17 సిరీస్‌లో అద్బుతమైన బ్యాటరీ సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు స్పెషల్ కలర్ ఆప్షన్స్‌ను కలిగి ఉండబోతోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ చాలా స్లిమ్‌గా ఉండబోతోంది. అలాగే డిస్ప్లే కూడా ప్రత్యేకమైన ప్రొటక్షన్‌ను కలిగి ఉండబోతున్నట్లు లీక్ అయిన వివరాల్లో పేర్కొన్నారు. దీంతో పాటు గత మోడల్స్ కంటే టెక్నాలజీ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన యాపిల్ కంపెనీ త్వరలోనే చేసే ఛాన్స్‌లు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter