Honda Livo 2025 New Model: రూ.83 వేలకే హోండా కొత్త Livo బైక్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే!

Honda Livo 2025 New Model: ప్రముఖ హోండా కంపెనీ మార్కెట్‌లోకి లివో బైక్‌ మోటర్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్‌ అయ్యింది. అంతేకాకుండా ఈ బైక్‌ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మోటర్‌సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 25, 2025, 06:29 PM IST
Honda Livo 2025 New Model: రూ.83 వేలకే హోండా కొత్త Livo బైక్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే!

Honda Livo 2025 Model Price: మోటర్‌సైకిల్‌ కంపెనీ హోండా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్ల నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన మోటర్‌సైకిల్స్‌ విడుదల చేస్తూ వస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా ఎన్నో బైక్స్‌ను విడుదల చేసింది. ఇదిలా ఉంటే రీసెంట్లీ హోండా మార్కెట్‌లోకి అద్భుతమైన మోటర్‌ సైకిల్‌ను విడుదల చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. 110సీసీ గతంలో విడుదల చేసిన బైక్‌లకు అప్డేట్‌ వేరియంట్‌లో కొత్త మోటర్‌సైకిల్‌ లాంచ్‌ అయ్యింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ ఆప్డేటెడ్‌ మోటర్‌సైకిల్ హోండా లివో పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఈ హోండా లివో బైక్‌ గతంలో విడుదలైనప్పటికీ అద్భుతమైన డిమాండ్‌ లభించడంతో.. దీనిని ఆప్డేట్ వేరియంట్‌లో హోండా కంపెనీ మళ్లీ విడుదల చేసింది. ఈ హోండా లివోతో ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన హీరో ప్యాషన్, బజాజ్ ప్లాటినా 110 పోటీ పడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హోండా లివో రెండు వేరియంట్స్‌లో విడుదల కాగా.. ధర రూ.83,080 (ఎక్స్-షోరూమ్)తో అందుబాటులో ఉంది. అయితే ఈ మోటర్‌సైకిల్ మూడు కలర్‌ ఆప్షన్స్‌ లభిస్తోంది. 

ఈ Livo మోటర్‌ సైకిల్ స్పెషల్ ట్యాక్స్‌తో వచ్చింది. అంతేకాకుండా అద్భుతమైన హెడ్‌లైట్, సైడ్ బాడీ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు పొడవైన సింగిల్-పీస్ సీటుతో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త హోండా లివో ఆధునత ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. ఈ మోటర్‌సైకిల్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫీచర్‌తో సైడ్ స్టాండ్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ బైక్‌ స్పెషల్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ మోటర్‌సైకిల్‌ RSU టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది స్పెషల్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తోంది. ఇక ఈ మోటర్‌సైకిల్ శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌తో విడుదలైంది. ఈ బైక్‌ 109.51cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది. ఈ ఇంజన్‌ 9.3 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా 8.4 bhp శక్తిని ఉత్పత్తి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. 

Read More: Bank Job Recruitment: నిరుద్యోగులకు బంఫర్‌ ఛాన్స్‌.. ఏకంగా మేనేజర్ అవ్వొచ్చు.. తక్కువ కాంపిటీషన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News