Oneplus Nord 3 Lowest Price: అమెజాన్ హాట్ డీల్‌..OnePlus Nord 3 5G కేవలం రూ.2,000లోపే పొందండి..ఎలాగంటే!

Get Oneplus Nord 3 Lowest Price: మార్కెట్‌లో వన్‌ప్లస్ నార్డ్‌ 3 5G (OnePlus Nord 3 5G) స్మార్ట్ ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని అమెజాన్ తమ కస్టమర్‌కి కొన్ని వన్ ప్లస్ సిరీస్‌లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌ను అతి తక్కువ ధరకే విక్రయిస్తోంది. అంతేకాకుండా వాటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 23, 2024, 08:46 AM IST
Oneplus Nord 3 Lowest Price: అమెజాన్ హాట్ డీల్‌..OnePlus Nord 3 5G కేవలం రూ.2,000లోపే పొందండి..ఎలాగంటే!

Get Oneplus Nord 3 Lowest Price: వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అదే గుర్తింపును కొనసాగించేందుకు కంపెనీ వన్‌ప్లస్ మిడిల్ బడ్జెట్ రేంజ్‌లో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్‌పై అప్పుడప్పుడు డిస్కౌంట్లను ప్రకటిస్తూ విక్రయిస్తోంది. ముఖ్యంగా వన్‌ప్లస్ విడుదల చేసిన నార్డ్ సిరీస్‌లపై ఎక్కువగా ప్రత్యేక తగ్గింపు ధరలతో అందిస్తుంది. అయితే అమెజాన్ కూడా తమ కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకొని.. ఈ సారి వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు కూడా ఎప్పటినుంచో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం అమెజాన్ వన్‌ప్లస్ నార్డ్‌ 3 5G (OnePlus Nord 3 5G) స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఈ డిస్కౌంట్ సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం అమెజాన్‌లోని ఈ స్మార్ట్ ఫోన్ ధర MRP రూ.33, 999 కాగా..ప్రత్యేక డీల్లో భాగంగా 12 శాతం తగ్గింపుతో కేవలం రూ.29,999కే లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా అమెజాన్ ఈ వన్‌ప్లస్ నార్డ్‌ 3 5G (OnePlus Nord 3 5G) స్మార్ట్ ఫోన్‌ పై రూ.2,000 కూపన్‌ని కూడా అందిస్తోంది. అయితే ఈ కూపన్ వినియోగించి మొబైల్‌ను కొనుగోలు చేస్తే, దాదాపు అదనంగా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ని రూ.27,999కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

ఇక ఈ వన్‌ప్లస్ నార్డ్‌ 3 5G (OnePlus Nord 3 5G) మొబైల్‌పై అమెజాన్ అందిస్తున్న బ్యాంక్ ఆఫర్ల వివరాల్లోకి వెళితే..దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే.. రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతోపాటు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కూడా చెల్లించిన డిస్కౌంట్ పొందుతారు. ఇక వన్ కార్డ్, HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కూడా బిల్ చెల్లించిన రూ.2,000 కంటే ఎక్కువగా తగ్గింపు పొందవచ్చు.. 

ఈ వన్‌ప్లస్ నార్డ్‌ 3 5G (OnePlus Nord 3 5G) స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో ఈ మొబైల్‌ను పొందవచ్చు. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది స్మార్ట్ ఫోన్ కండిషన్ను బట్టి ఆధారపడి ఉంటుంద. మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ బాగుంటేనే రూ.28,450 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోను ఈ వన్‌ప్లస్ నార్డ్‌ 3 5G మొబైల్ కేవలం రూ.2,000 కంటే తక్కువ ధరలోనే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అమెజాన్ అధికారిక వెబ్సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News