OnePlus Nord CE 3 Lite 5G Price: మరో సారి తగ్గింపు వన్‌ప్లస్‌ మొబైల్స్‌ ధరలు..OnePlus Nord CE 3 Liteపై రూ.18,700 తగ్గింపు..

Drop OnePlus Nord CE 3 Lite 5G Price: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్‌ భారీ తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఇతర ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2023, 08:59 AM IST
OnePlus Nord CE 3 Lite 5G Price: మరో సారి తగ్గింపు వన్‌ప్లస్‌ మొబైల్స్‌ ధరలు..OnePlus Nord CE 3 Liteపై రూ.18,700 తగ్గింపు..

 

OnePlus Nord CE 3 Lite 5G Price: తక్కువ బడ్జెట్‌లో శక్తివంతమైన ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్‌ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. OnePlus స్మార్ట్‌ ఫోన్స్‌ను బంపర్‌ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అమెజాన్‌ అందిస్తున్న వన్‌ప్లస్‌ కమ్యూనిటీ సేల్‌(OnePlus Community Sale)లో భాగంగా ప్రముఖ వన్‌ప్లస్‌ బ్రాండ్‌కి సంబంధించి మొబైల్స్‌ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్స్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్‌ భాగంగా ఏ స్మార్ట్‌ ఫోన్‌ అతి తక్కువ ధరకు లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

అమెజాన్‌ అందిస్తున్న వన్‌ప్లస్‌ కమ్యూనిటీ సేల్‌(OnePlus Community Sale)లో భాగంగా OnePlus Nord CE 3 5G స్మార్ట్ ఫోన్‌ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ అమెజాన్‌లో రెండు కలర్‌ ఆప్షన్స్‌, రెండు స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ ధర రూ. 19,999కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మరింత తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకుంటే బ్యాంక్‌ ఆఫర్స్‌ వినియోగించాల్సి ఉంటుంది. మీరు ఈ OnePlus Nord CE 3 5G మొబైల్‌ను ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్‌ పే క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించిన దాదాపు రూ. 600 వరకు తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌ను వన్‌కార్డ్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించిన దాదాపు రూ.1,500 వరకు డిస్కౌంట్‌ పొందుతారు. అంతేకాకుండా కెనరా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించి బిల్‌ చెల్లిస్తే 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో బ్యాంక్‌ ఆఫర్స్‌ అన్ని పోను మీరు కేవలం ఈ స్మార్ట్ ఫోన్‌ రూ.18,499కే పొందవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్ ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. మీరు దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే డెడ్‌ చీప్‌గా పొందవచ్చు.

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఈ OnePlus Nord 3 5G స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌ వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.18,700 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ మొబైల్‌ ఫోన్‌ కేవలం రూ.1,500కే లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ అనేది మీ స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌పై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎక్చేంజ్‌ బోనస్‌ పొందడానికి ఎక్చేంజ్‌ చేసే పాత స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్‌ కీలక పాత్ర పోషిస్తుంది.  
 
ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.7 అంగుళాల ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్‌
Qualcomm Snapdragon 782G ప్రాసెసర్
80W సూపర్ VOOC ఛార్జింగ్‌
5,000 mAh బ్యాటరీ ప్యాక్‌
ఆండ్రాయిడ్ 13 ఆధారిత స్కిన్ అవుట్ ఆఫ్ బాక్స్‌
50MP ప్రైమరీ కెమెరా
2MP మాక్రో కెమెరా
 8MP అల్ట్రా-వైడ్ కెమెరా

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News