Amazon Offer Vs Flipkart Offer: వన్‌ప్లస్‌ Nord CE 3 Lite 5G మొబైల్‌ను ఎందులో కొనుగోలు చేస్తే డెడ్‌ ఛీప్‌గా లభిస్తుంది!

OnePlus Nord CE 3 Lite 5G Cut: వన్‌ప్లస్‌ Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌తో పాటు ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 6, 2024, 10:53 AM IST
Amazon Offer Vs Flipkart Offer: వన్‌ప్లస్‌ Nord CE 3 Lite 5G మొబైల్‌ను ఎందులో కొనుగోలు చేస్తే డెడ్‌ ఛీప్‌గా లభిస్తుంది!

 

OnePlus Nord CE 3 Lite 5G Cut: వన్‌ప్లస్‌ లవర్స్‌కి పెద్ద శుభవార్త.. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన కొన్ని వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్‌లోకి వచ్చిన OnePlus Nord CE 3 Lite 5G మొబైల్‌ డెడ్ చీప్‌గా లభిస్తోంది. ప్రత్యేక డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 10 నుంచి 12 శాతం వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అలాగే ఈ మొబైల్‌ అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ రెండు ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లలో కూడా ఇది అందుబాటులో ఉంది. అయితే ఈ రెండింటిలో ఎందులో కొనుగోలు చేస్తే ఈ OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ వివిధ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 19,999 కాగా,  8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్ రూ. 21,999లకు అందుబాటులో ఉంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా విషయానికొస్తే.. ఇది 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాతో లభిస్తోంది. దీంతో పాటు 16-మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్‌ కెమెరా సెటప్‌తో అందుబాటులో ఉంది. అలాగే ఈ మొబైల్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.  

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకమైన ఆఫర్స్‌:
ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్ కలిగిన ఈ OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 17,444తో అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేకమైన తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి ఫ్లాట్ రూ. 2,555 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా దీనిని EMI ఆప్షన్‌తో కొనుగోలు చేసేవారికి దాపుపు భారీ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. అలాగే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి 9 నెలల నో EMI ఆప్షన్‌తో పాటు రూ. 1,250 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అన్ని ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను  రూ. 15,694కే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ గతంలో ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను అందించిన ప్రస్తుతం తొలగించిన్నట్లు తెలిపింది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

అమెజాన్‌లో ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్‌లు:
ప్రస్తుతం ఈ OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ ఇది అమెజాన్‌లో రూ. 17,999 ధరతో లభిస్తోంది. దీంతో పాటు ప్రత్యేకమైన ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. అయితే ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ. 2,000 వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI పేమెంట్‌ చేస్తే దాదాపు  రూ.1250 వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.16,749కే లభిస్తోంది. అలాగే ఈ మొబైల్‌పై ఏక్చేంజ్‌ తగ్గింపు లభిస్తుంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ. 16,600 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ లభిస్తుంది. దీంతో పాటు ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఇతర ముఖ్యమైన ఫీచర్స్:
5G కనెక్టివిటీ
8GB RAM
128GB స్టోరేజ్
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
డ్యూయల్ స్పీకర్లు

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News