Oneplus Nord Ce 4 Lite Vs Nord Ce 3 Lite: ఈ కొత్త వన్‌ప్లస్‌ మొబైల్ కొనుగోలు చేసేవారు తప్పకుండా ఈ తేడాలు తెలుసుకోండి!

Oneplus Nord Ce 4 Lite 5G Vs Oneplus Nord Ce 3 Lite 5G: మార్కెట్‌లో వన్‌ప్లస్‌ నార్డో సిఈ 4 5g స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ వన్‌ప్లస్‌ నార్డో సిఈ 3 5gతో పోటీ పడుతోంది. అయితే ఈ రెండింటి మధ్య ఏ మొబైల్‌ చాలా బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 10, 2024, 03:22 PM IST
Oneplus Nord Ce 4 Lite Vs Nord Ce 3 Lite: ఈ కొత్త వన్‌ప్లస్‌ మొబైల్ కొనుగోలు చేసేవారు తప్పకుండా ఈ తేడాలు తెలుసుకోండి!

Oneplus Nord Ce 4 Lite 5G Vs Oneplus Nord Ce 3 Lite 5G In Telugu: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రావడం వల్ల చాలా మంది యువత ఈ కంపెనీ మొబైల్స్‌ను మాత్రమే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వన్‌ప్లస్‌ కంపెనీ ఇటీవలే నార్డో సిఈ 4 5g స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ నార్డో సిఈ 3 5g మొబైల్‌ విక్రయాలతో పోటీ పడుతోంది. నిజానికి ఈ రెండు మొబైల్స్‌ అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటి మధ్య ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌లో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

వన్‌ప్లస్‌ నార్డో సిఈ 4 5g, వన్‌ప్లస్‌ నార్డో సిఈ 3 5g మధ్య 10 ముఖ్యమైన తేడాలు:
ఈ వన్‌ప్లస్‌ నార్డో సిఈ 4 5g, వన్‌ప్లస్‌ నార్డో సిఈ 3 5g స్మార్ట్‌ఫోన్స్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇందులో నార్డో సిఈ 4 స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల AMOLED డిస్ల్పేతో అందుబాటులోకి వచ్చింది. ఈ స్క్రీన్‌ 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌ Snapdragon 695 5G ప్రాసెసర్‌తో మార్కెట్‌లో లభిస్తోంది. ఇక నార్డో సిఈ 3 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది 6.43 అంగుళాల AMOLED డిస్ల్పేతో లభిస్తోంది. దీంతో పాటు 90Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్‌తో అందుబాటులో ఉంది. అలాగే ఇది Snapdragon 480 5G ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. 

ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ ర్యామ్‌, ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వివరాల్లోకి వెళితే, నార్డో సిఈ 4 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మొత్తం రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ అయితే, రెండవది 128GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక నార్డో సిఈ 3 మొబైల్‌ వివరాల్లోకి వెళితే, ఇది 6GBర్యామ్‌, 8GB ర్యామ్‌,  సింగిల్ 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో లభిస్తోంది.  

ఇక ఈ రెండు మొబైల్స్‌ కెమెరా వివరాల్లోకి వెళితే, నార్డో సిఈ 4 త్రిపుల్‌ కెమెరా సెటప్‌తో అందుబాటులో ఉంది. దీని బ్యాంక్‌ సెటప్‌లో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాలు ఉంటాయి. అంతేకాకుండా వీడియో కాలింగ్‌ కోసం, ఈ మొబైల్‌ ఫ్రంట్‌ భాగంలో 16MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది. ఇక నార్డో సిఈ 3 మొబైల్‌ వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ 48MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాలతో అందుబాటులో ఉంది. దీంతో పాటు 16MP సెల్ఫీ కెమెరా ఫ్రంట్‌ కెమెరాను కలిగి ఉంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

ఈ రెండింటి బ్యాటరీ, ధర వివరాల్లోకి వెళితే..నార్డో సిఈ 4 స్మార్ట్‌ఫోన్‌ 5000mAh బ్యాటరీతో పాటు 33W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ ఫోన్‌ Android 13, OxygenOS 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. ఇక నార్డో సిఈ 3 స్మార్ట్‌ఫోన్‌ 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఇది Android 11, OxygenOS 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. ఇక ఈ రెండింటి ధర విషయానికొస్తే, ఇందులో నార్డో సిఈ 4 మొబైల్‌ ధర రూ. 23,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక నార్డో సిఈ 3 స్మార్ట్‌ఫోన్‌ మాత్రం రూ.16,999 నుంచి మార్కెట్‌లో లభిస్తుంది.

ఏది బెస్ట్‌?:
వన్‌ప్లస్‌ నార్డో సిఈ 3 స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే, వన్‌ప్లస్‌ నార్డో సిఈ 4 మొబైల్‌లో అనేక ముఖ్యమైన  ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ, ఆపరేటింగ్ సిస్టమ్, బ్లూటూత్, Wi-Fi వంటి అనేక ఫీచర్స్‌ ఆప్డేట్‌తో లభిస్తున్నాయి. అయితే ధర పరంగా చూస్తే నార్డో సిఈ 4 కాస్త ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రెండింటిలో వన్‌ప్లస్‌ నార్డో సిఈ 4 చాలా బెస్ట్‌ అని నిపుణులు అభిప్రాయం.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News