లాక్‌డౌన్‌ను పాటిస్తేనే కానీ కరోనా వైరస్‌ను నియంత్రించడం సాధ్యం కాదు. అందుకే ప్రపంచదేశాలన్నీ విధిగా లాక్ డౌన్, సోషల్ డిస్టన్స్ నిబంధనలను పాటిస్తూ కరోనాను నివారించేందుకు కృషి చేస్తున్నాయి. ఇంట్లోంచి బయటికొస్తే చాలు... కరోనా వైరస్ ఏ వైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది.
కరోనావైరస్‌ని అరికట్టేందుకు యావత్ దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ విధించడంతో జనం అంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. దేవాలయాలకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో నవరాత్రుల సందర్భంగా మహిళలు అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఇలా తమ తమ ఇంట్లోని బాల్కనీల నుండే దుర్గాదేవికి హారతి ఇచ్చారు.
కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కుంటే ఏం జరుగుతుందో తెలిసిందే కదా ? తలకాయ ఉన్నోడు ఎవ్వరూ ఆ పని చేయరు. ఒకవేళ చేస్తే ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగో సరిగ్గా ఇక్కడ కూడా అటువంటిదే జరిగింది. తాను నిలబడిన చోట ఉన్న పైకప్పు దేనిపైనైతే ఆధారపడి ఉందో.. దానినే కూలగొట్టబోయాడు ఓ కుర్రాడు. కానీ అంతిమంగా ఏం జరిగిందో ఈ వీడియోలో మీరే చూడండి.
సలాం ఏ ఇష్క్ టీవీ షోలో ప్రిన్స్ నరులా తన ప్రేయసి యువికాకు ఎంతో అందంగా లవ్ ప్రపోజ్ చేసిన వైనం అందరినీ ఆకట్టుకుంటోంది. డ్యాన్సింగ్ రియాలిటీ షోలో ఈ రియల్ లవ్ బర్డ్స్ ఒకిరికొకరు లవ్ ప్రపోజ్ చేసుకున్న విధానం ఆ షోకి వచ్చిన ఆడియెన్స్‌నే కాదు.. ఆ షోను చూసిన ఆడియెన్స్‌ను కూడా అలరించింది. అన్నింటికిమించి ఆ ఇద్దరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ షోను హీటెక్కించింది. ఆ ఇద్దరి లవ్ ప్రపోజల్, ఆ హాట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలియాలంటే ఇదిగో ఈ వీడియో చూడాల్సిందే.
విమానం టేకాఫ్ అవుతుందనడానికి కొన్ని నిమిషాల ముందు ఉన్నట్టుండి ఓ పక్షి ఎగిరొచ్చి విమానంలోకి ప్రవేశించింది. గోల్ కొట్టినట్టుగా సరిగ్గా వచ్చి విమానంలోకి అయితే దూరింది కానీ.. అందులోంచి తిరిగి ఎలా బయటపడాలో అర్థం కాక అందులోనే చక్కర్లు కొట్టసాగింది. అయోమయంలో పడిన ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థం కాక అలా చూస్తుండిపోగా... ఇంకొంతమంది పోతే రాదు ఈ దృశ్యం అన్నట్టుగా తమ మొబైల్ కెమెరాల్లో బంధిస్తూ బిజీ అయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
శునకాన్ని చూస్తే కోతికి కోపం... కోతిని చూస్తే శునకానికి కోపం.. ఎందుకంటే శునకాన్ని ఆట పట్టిస్తూ.. ఆ శునకానికి దొరక్కుండా చెట్లెక్కి కూర్చునే కోతి బుద్ది కోతుల సొంతం. అది ఆ రెండు జంతువుల మధ్య ఉన్న జాతి వైరం
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు రన్నింగ్ కార్ల నుండి దూకి.. ఆ తర్వాత అదే రన్నింగ్ కారుతో సమానంగా డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను వాట్సప్‌లో, ఫేస్ బుక్‌లో షేర్ చేయడం చూస్తున్నాం.
వెర్రి వెయ్యి విధాలు అంటారు. కానీ ఇది వెర్రో.. పిచ్చో కాదు... అపారమైన భక్తి మాత్రమే అంటున్నాడు తెలంగాణలోని జనగాంకి చెందిన బుస్సా క్రిష్ణ. ఈ యువకుడు గత కొంతకాలంగా డొనాల్డ్ ట్రంప్‌కి ప్రతీ రోజు పూజ చేయడమే పనిగా పెట్టుకున్నాడు.
టియా ఫ్రీమాన్ అనే విదేశీ మహిళకు ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ దేశాలు తిరుగుతూ ఉండే ఆమె తనకు గర్భమని తెలిసినా కూడా ప్రయాణాన్ని వాయిదా వేసుకోలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.