వైరల్ వీడియోలు ఎవరినైనా సంభ్రమాశ్చర్యాలకు లోనుచేస్తాయన్న విషయం వాస్తవమే. నేడు యూట్యూబ్‌లో వైరల్ వీడియోలే అత్యధిక వీక్షకులను పొందుతున్నాయి. కేవలం క్షణాల వ్యవధిలో ఉండే అలాంటి వీడియోలను అన్నింటినీ ఒకచోట చేర్చి.. దాదాపు 20 నిమిషాల ఫిల్మ్‌గా రూపొందిస్తే ఎలా ఉంటుంది. ఆ ప్రయోగాన్ని చేసింది ఓ యూట్యూబ్ ఛానెల్.
2017లో యూట్యూబ్ సైటులో బాగా వైరల్ అయిన 100 ప్రత్యేకమైన వీడియోలను ఒకచోట చేర్చి..ఒక చిన్న ఫిల్మ్‌గా రూపొందించారు ఆ ఛానల్ నిర్వాహకులు. ఆ యూట్యూబ్ వీడియోని ఇప్పటికే కోటి 90 లక్షల మంది వీక్షకులు చూడడం గమనార్హం. అందులో వినోదాన్ని పంచే వీడియోలతో పాటు.. ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలతో పాటు.. చాలా సాధారణమైన వీడియోలు కూడా ఉన్నాయి. అయితేనేం.. ఇక్కడ వీక్షకులు ఏవి చూస్తారో అవే పాపులర్ అన్న విషయాన్ని నమ్మక తప్పదు కదా..