విమానంలో తోటి క్రికెటర్లతో హార్దిక్ పాండ్య ఇంటర్వ్యూ

ఐర్లాండ్‌ జట్టుతో రేపటి నుండి జరగబోయే టీ-20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా జట్టు బ్రిటన్ చేరుకుంది.

Last Updated : Jun 26, 2018, 07:47 PM IST
విమానంలో తోటి క్రికెటర్లతో హార్దిక్ పాండ్య ఇంటర్వ్యూ

ఐర్లాండ్‌ జట్టుతో రేపటి నుండి జరగబోయే టీ-20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా జట్టు బ్రిటన్ చేరుకుంది. భారత్ నుంచి ఓ ఫ్లైట్‌లో బ్రిటన్‌ వెళ్లిన ఇండియన్ క్రికెటర్లు... విమానంలో చాలా ఆహ్లాదంగా గడిపారు. చాలా ఆనందంగా ఒకరితో ఒకరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అందుకు కారణం అయిన వ్యక్తి ఎవరో తెలుసా..? అతడే హార్దిక్ పాండ్య.

ఈ యువ క్రికెటర్ తోటి క్రికెటర్లను, మేనేజర్లను వైవిధ్యమైన రీతిలో ఇంటర్వ్యూ చేయడమే కాకుండా.. తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. టీమిండియాలో సూపర్ మ్యాన్ ఎవరు? భారత జట్టులో డాన్ అని ఎవరిని అంటారు... లాంటి ప్రశ్నలను సంధిస్తూ తన తోటి ఆటగాళ్లను బెంబేలెత్తించాడు హార్దిక్ పాండ్య.

ఇదే వీడియోలో మహేంద్ర సింగ్ ధోనిని కూడా ప్రశ్న అడగడానికి పాండ్య సిద్ధమవ్వగా.. ఓ బిస్కెట్ చేతిలో పెట్టిగా సున్నితంగా వద్దని తెలిపాడు ధోని. తర్వాత శిఖర్ ధావన్‌తో తన ఇంటర్వ్యూలో భాగంగా ఓ పాట కూడా పాడించాడు పాండ్య. 

Trending News