హల్చల్ చేస్తున్న సెహ్వాగ్ అత్తా, కోడళ్ల వీడియో

క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సూపర్ సెలబ్రిటీ అనుకోవచ్చు.

Last Updated : Jun 1, 2018, 12:32 PM IST
హల్చల్ చేస్తున్న సెహ్వాగ్ అత్తా, కోడళ్ల వీడియో

క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సూపర్ సెలబ్రిటీ అనుకోవచ్చు. నవ్వు తెప్పించే జోకులతో పాటు చిత్ర విచిత్రమైన ట్వీట్లను షేర్ చేయడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఈ మధ్యకాలంలో ఆయన పోస్టు చేసే వీడియోలు కూడా ఆయన అభిమానులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. జనాలను కవ్వించే రీతిలో ఉండే సెహ్వాగ్ పోస్టులు ఈ మధ్యకాలంలో బాగానే వైరల్ అవుతున్నాయి.

ఇటీవలే సెహ్వాగ్ పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది. చిన్న ప్లాస్టిక్ టబ్‌లో నీటిని తీసుకొని తన సతీమణి కాళ్లు కడిగే ఓ పురుష పుంగవుడిని చూసి ఆయన భార్య ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. ఆ భర్త కూడా తన భార్య పాదాలను కడగడం అంత గొప్ప పని ఏముంటుంది అన్న రీతిలో ఫీలైపోతూ ఉంటాడు. అలాంటి సమయంలో ఇంటికి వచ్చిన తన తల్లిని చూసి కంగుతింటాడు కాళ్లు కడుగుతున్న వ్యక్తి.

అయితే ఇక చేసేదేముంది...! అందుకే ఆ భార్య భర్తలిద్దరూ తమ పొజిషన్స్ మార్చేసుకుంటారు. ఈ వీడియోకి సెహ్వాగ్ "మీ అత్తయ్య అనుకోకుండా వస్తే ఏం చేస్తారు" అని టైటిల్ కూడా పెట్టారు. ఈ పోస్టుకి చాలా లైకులు, కామెంట్లు కూడా రావడం గమనార్హం. 

Trending News