Maharashtra: మహారాష్ట్రలో హైడ్రామా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అగాధం మరింతగా పెరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్సెస్ కేంద్ర మంత్రి వివాదం చిలికి చిలికి గాలివానగా మారి..మంత్రి అరెస్టుకు దారితీసింది.
Covid 19 Restrictions: దేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. నిన్నటి వరకూ ఐదు రాష్ట్రాలకే పరిమితమైన కరోనా మహమ్మారి విస్తరణ ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలకు సైతం వ్యాపించింది. పెరుగుతున్న కరోనా సంక్రమణ నేపధ్యంలో ఆంక్షలు పెరుగుతున్నాయి.
Maharashtra: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. నిత్యం వైరస్ కేసులు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించకపోతే మరోసారి లాక్డౌన్ విధిస్తామన్నారు.
Bombay High court Judgement: బోంబే హైకోర్టు వివాదాస్పద తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలో దిగింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయనుంది.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ఇప్పటికే ఇటు బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన కీలక నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్ర మహా వికాస్ అగాఢి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) పాటు ఆయన కుటుంబానికి భద్రతను తగ్గించింది.
బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ (Urmila Matondkar) మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన ( Shiv Sena ) లో చేరారు. మంగళవారం మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray ) సమక్షంలో ముంబైలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్ (Urmila Matondkar) పేరు మహారాష్ట్ర శాసన మండలికి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నటి ఊర్మిళ పేరును మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government ) నామినేట్ చేయనుంది.
మహారాష్ట్రలో ఓ వైపు కంగనా రనౌత్, మరోవైపు నేవీ మాజీ అధికారి మదన్‌శర్మ శివసేన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసుపై రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. ఈ కేసుపై బాలీవుడ్‌తోపాటు మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
విప్లవ కవి వరవరరావును ( Varavara Rao ) ఉంచిన మహారాష్ట్రలోని తలోజా సెంట్రల్ జైల్లో ( Taloja central jail ) కరోనావైరస్ తీవ్రంగా వ్యాపించిందని వార్తలు వస్తుండటంతో పాటు ఆ వ్యాధితో ఒకరు మరణించారని మహారాష్ట్ర ప్రభుత్వమే ( Maharashtra govt ) ప్రకటించిన నేపథ్యంలో 80 ఏళ్ళ వృద్దుడైన వరవరరావు ఆరోగ్యంపై ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.
మహారాష్ట్రలో కరోనావైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ముంబై పరిధిలోనే కరోనా ప్రభావం అధికమవుతుండటాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రంగా పరిగణిస్తూ బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ పర్దేశిని ( BMC Commissioner Praveen Pardeshi ) ఆ పోస్టు నుంచి తప్పిస్తూ ఆయనపై బదిలీ వేటు వేశారు.
కరోనావైరస్ భయంతో మహారాష్ట్ర వణికిపోతోంది. మంగళవారం తెల్లవారే వరకు ఆ ఒక్క రాష్ట్రంలోనే 2,334 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా.. మంగళవారం మధ్యాహ్నం వరకు అప్డేట్స్ ప్రకారం మరో 121 మందికి కరోనా సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,455కి చేరింది.
షిర్డీ సాయి బాబా జన్మస్థలమైన పత్రిని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్ల నిధులు కేటాయించడం జరుగుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చేసిన ప్రకటనపై షిర్డీ వాసులు తీవ్రం అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. సాయి బాబా బతికున్నంత కాలం షిర్డీలోనే గడిపాడని.. ఆయన జన్మస్థలం గురించి ఎప్పుడూ ఊసెత్తలేదని.. అటువంటప్పుడు ఇప్పుడు పత్రిని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని సర్కార్ ప్రకటించడం ఏంటంటూ షిర్డీ వాసులు ఆందోళన చేపట్టారు. ఇదే విషయమై శనివారం చర్చించి ఓ నిర్ణయం తీసుకుని జనవరి 19న బంద్ చేపడతామని షిర్డీ గ్రామ పంచాయతీ ప్రకటించింది.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 145 సభ్యుల మద్దతు ఏ పార్టీకీ లేకపోవడంతో మహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటు క్లిష్టంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.