Uddhav Thackeray: మహారాష్ట్ర సీఎం ఇంటికి బాంబు బెదిరింపు

మహారాష్ట్రలోని ( Maharastra ) బాంద్రాలో ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ( Uddhav Thackeray ) నివాసానికి నేడు బాంబు బెదిరింపు వచ్చింది. 

Last Updated : Sep 6, 2020, 08:36 PM IST
    • మహారాష్ట్రలోని ( Maharastra ) బాంద్రాలో ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ( Uddhav Thackeray ) నివాసానికి నేడు బాంబు బెదిరింపు వచ్చింది.
    • థాక్రే నివాసం అయిన మాతోశ్రీని ( Matosri ) బాంబుతో బెదిరిస్తాం అని ఒక ఫోన్ కాల్ వచ్చింది.
Uddhav Thackeray: మహారాష్ట్ర సీఎం ఇంటికి బాంబు బెదిరింపు

మహారాష్ట్రలోని ( Maharastra ) బాంద్రాలో ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ( Uddhav Thackeray ) నివాసానికి నేడు బాంబు బెదిరింపు వచ్చింది. థాక్రే నివాసం అయిన మాతోశ్రీని ( Matosri ) బాంబుతో బెదిరిస్తాం అని ఒక ఫోన్ కాల్ వచ్చింది.  థాక్రే నివాసాన్ని పేల్చివేస్తాం అని బెదిరింపు చేసిన వ్యక్తి తనను తాను దావూద్ ( Dawood)  అని పేరు వెల్లడించినట్టు సమాచారం. ఈ ఘటనపై ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు నిర్వహిస్తోంది. 

బాంద్రాలో ఉన్న మాతోశ్రీ నివాసంలో ఉన్న ల్యాండ్ లైన్ నెంబర్ కు సుమారు 3-4 సార్లు ఫోన్ కాల్స్ వచ్చాయి. మాతో శ్రీ అనేది థాక్రే కుటుంబానికి అధికార నివాసం. తాజా సమాచారం ప్రకారం దుబాయ్ లో ఉంటున్న ఒక వ్యక్తి ఈ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. కాల్ చేసిన వ్యక్తి మాతో శ్రీ నివాసాన్ని బాంబుతో పేల్చివేస్తాం అని చెప్పి..తన పేరు దావూద్ అని తెలిపాడు.

 

Trending News