Urmila Matondkar: మహారాష్ట్ర ఎగువ సభకు నటి ఊర్మిళ..!

బాలీవుడ్‌ నటి ఊర్మిళ మతోండ్కర్‌ (Urmila Matondkar) పేరు మహారాష్ట్ర శాసన మండలికి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నటి ఊర్మిళ పేరును మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government ) నామినేట్ చేయనుంది.

Last Updated : Oct 31, 2020, 07:12 AM IST
Urmila Matondkar: మహారాష్ట్ర ఎగువ సభకు నటి ఊర్మిళ..!

Actress Urmila Matondkar to be nominated as Maharashtra MLC?: ముంబై: బాలీవుడ్‌ నటి ఊర్మిళ మతోండ్కర్‌ (Urmila Matondkar) పేరు మహారాష్ట్ర శాసన మండలికి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నటి ఊర్మిళ పేరును మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government ) నామినేట్ చేయనుంది. అయితే.. మహారాష్ట్ర శాసనమండలి (Maharashtra Legislative Council) కి గవర్నర్‌ కోటాలో పలు రంగాల్లో విశేష సేవలందించిన 12 మంది సభ్యులను నామినేట్‌ చేయాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సభ్యుల పేర్లను ఎంపిక చేసి గవర్నర్ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి సిఫారసు చేయనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వర్గం గురువారం సమావేశం సైతం నిర్వహించింది. ఈ క్యాబినేట్ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ఊర్మిళ పేరును కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు కాంగ్రెస్, శివసేన పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. Also read: Kangana Ranaut: ఆమెకు నటనే రాదు..ఆమె ఒక అడల్ట్ స్టార్

అయితే ఇదే విషయంపై శివసేన పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) ను మీడియా ప్రశ్నించగా.. ఊర్మిళ మతోండ్కర్ పేరును నామినేట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సభ్యుల ఎంపిక అనేది మంత్రివర్గం చేతుల్లోనే ఉంటుందన్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ( Uddhav Thackeray) నే నిర్ణయం తీసుకుంటారని రౌత్ సమాధానమిచ్చారు. 

ఇదిలాఉంటే.. నటి ఊర్మిళ మతోండ్కర్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్‌ ముంబై నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్‌ శెట్టి చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆమె పార్టీ నుంచి తప్పుకున్నారు. ఇటీవల కాలంలో నటి కంగనా రనౌత్.. ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (pok) తో పోల్చిన తర్వాత.. ఆమె వ్యాఖ్యలను ఊర్మిళ తిప్పికొట్టి వార్తల్లో నిలిచింది. Also read: Urmila Matondkar: కంగనా అడల్ట్ స్టార్ కామెంట్‌పై ఊర్మిళ ట్వీట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News