TikTok: భారతీయుల డేటాను టిక్ టాక్ ఎక్కడ దాచింది?

టిక్ టాక్ ( Tiktok) పై నిషేధం అనంతరం అనేక రకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏ డేటా చోరీ అవుతుందనే భయంతో ఆ యాప్ ను నిషేదించారో..ఇప్పుడు ఆ డేటా పరిస్థితి ఏంటి? భారతీయుల డేటాను టిక్ టాక్ ( Indians Tiktok data) సంస్థ ఎక్కడ దాచిపెట్టింది ?

Last Updated : Jul 6, 2020, 06:24 PM IST
TikTok: భారతీయుల డేటాను టిక్ టాక్  ఎక్కడ దాచింది?

టిక్ టాక్ ( Tiktok) పై నిషేధం అనంతరం అనేక రకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏ డేటా చోరీ అవుతుందనే భయంతో ఆ యాప్ ను నిషేదించారో..ఇప్పుడు ఆ డేటా పరిస్థితి ఏంటి? భారతీయుల డేటాను టిక్ టాక్ ( Indians Tiktok data) సంస్థ ఎక్కడ దాచిపెట్టింది ?

చైనా దేశపు యాప్ ( China apps) లపై భారతదేశం నిషేధం విధించడానికి ప్రదాన కారణం దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పుగా ఉండటం. భారత-చైనా సరిహద్దు వివాదం ( Indo-china border dispute) కారణంగా చైనా దేశపు 59 యాప్ లను ఇండియా నిషేధించింది. ఇందులో ప్రముఖంగా చెప్పుకోదగ్గది టిక్ టాక్. ఎందుకంటే టిక్ టాక్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 26 కోట్ల యూజర్లలో 11 కోట్ల మంది భారతీయులే. వీరంతా టిక్ టాక్ ద్వారా వీడియోలు తీసి ప్రాచుర్యం పొందినవారే. చైనా దేశపు యాప్  ల నుంచి యూజర్ల డేటాను చైనా ప్రభుత్వం సేకరిస్తోందన్నది ప్రధాన ఆరోపణ. ఈ కారణంతోనే ఆ దేశపు యాప్ లను భారతదేశం బ్యాన్ చేసింది.  అయితే టిక్ టాక్ సీఈవో కెవిన్ మేయర్ ( Tiktok CEO kevin mayor) మాత్రం దీన్ని ఖండించారు. చైనా ఎప్పుడూ భారతీయుల డేటా గురించి అడగలేదని స్పష్టం చేశారు. Also read:Google: ప్లే స్టోర్ నుంచి ఆ యాప్ లను గూగుల్ ఎందుకు తొలగించింది?

ఇదే సందర్బంలో టిక్ టాక్ భారతీయుల సమాచారమంతా ఎక్కడ దాచిపెట్టిందనే విషయం మాత్రం తెలిసింది. భారతీయుల డేటాను సింగ పూర్ లో దాచినట్టు టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ ( Bytedance) ప్రకటించింది. ఇండియాలో కూడా డేటా సెంటర్లను ( Data centres) నిర్మించాలనుకున్నట్టు  టిక్ టాక్ ఇండియాకు లేఖ రాయడం గమనార్హం. Also read: Govt Jobs 2020: ఆర్‌సిఎఫ్ఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News