Moj app: TikTok కి ప్రత్యామ్నాయంగా మరో యాప్ లాంచ్ చేసిన ShareChat

Sharechat launches Moj app: న్యూ ఢిల్లీ: టిక్‌టాక్‌ యాప్‌ని భారత్ నిషేధించడంతో ఆ యాప్‌కి ఉన్న మార్కెట్‌ని క్యాష్ చేసుకునేందుకు ఇంచుమించు టిక్ టాక్ ఫీచర్స్‌తోనే ( Tiktok app ) ఉన్న ఇంకొన్ని యాప్స్ మార్కెట్‌లోకి క్యూ కడుతున్నాయి. భారత్‌కి చెందిన సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్ కూడా తాజాగా అటువంటి యాప్‌నే లాంచ్ చేసింది.

Last Updated : Jul 4, 2020, 12:07 AM IST
Moj app: TikTok కి ప్రత్యామ్నాయంగా మరో యాప్ లాంచ్ చేసిన ShareChat

Sharechat launches Moj app: న్యూ ఢిల్లీ: టిక్‌టాక్‌ యాప్‌ని భారత్ నిషేధించడంతో ఆ యాప్‌కి ఉన్న మార్కెట్‌ని క్యాష్ చేసుకునేందుకు ఇంచుమించు టిక్ టాక్ ఫీచర్స్‌తోనే ( Tiktok app ) ఉన్న ఇంకొన్ని యాప్స్ మార్కెట్‌లోకి క్యూ కడుతున్నాయి. భారత్‌కి చెందిన సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్ కూడా తాజాగా అటువంటి యాప్‌నే లాంచ్ చేసింది. మోజ్ యాప్‌ పేరిట షేర్‌చాట్ లాంచ్ ( Moj app launched by Sharechat ) చేసిన ఈ యాప్‌లో కూడా టిక్‌టాక్‌ యాప్‌లో ఉన్న అన్ని ఫీచర్స్ ఉన్నాయి. టిక్ టాక్‌లో ఉన్నట్టుగానే స్పెషల్ ఎఫెక్ట్స్, చిన్న వీడియోలు, స్టిక్కర్లు ఉండటంతో టిక్‌టాక్ యాప్ యూజర్స్ ( Tiktok app users ) కొంతమంది ఈ మోజ్ యాప్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. చింగారి యాప్ ( Chingari app ) కూడా అలా టిక్ టాక్ యాప్ బ్యాన్ అయిన తర్వాత భారీ పాపులారిటీని సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ( Also read: PM Modi`s Ladakh visit: ప్రధాని లఢక్ పర్యటనపై స్పందించిన చైనా )

గూగుల్ ప్లే స్టోర్‌లో ( Google play store) ప్రస్తుతం ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్న మోజ్ యాప్ 15 భాషల్లో సేవలు అందిస్తోంది. 24 గంటల్లోనే 50 వేల మంది మోజ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. మోజ్ యాప్‌కి 4.3 రేటింగ్ కూడా ఇచ్చారు. 

మోజ్ యాప్ ఫీచర్స్ ఏంటి ( Moj app features ) ?
మోజ్ యాప్‌లోనూ యూజర్స్ ( Moj app users ) 15 సెకన్ల వరకు వీడియోలను క్రియోట్ చేయవచ్చు. ఆ వీడియోలను తమ ప్రొఫైల్ కింద అప్‌లోడ్ చేయవచ్చు. అదే సమయంలో వీడియో క్వాలిటీ ( Video quality ) పెంచుకునేందుకు పలు ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. టిక్‌టాక్‌ యాప్ తరహాలోనే మోజ్ యాప్ కూడా లిప్-సింక్ ఫీచర్ కలిగి ఉంది. అన్నింటికిమించి టిక్ టాక్ మొబైల్ యాప్‌ తరహాలోనే మోజ్ యాప్‌లోనూ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ కలిగి ఉండటంతో టిక్ టాక్ యాప్‌తో పోయిన ఆనందాన్ని జనం ఈ తరహా యాప్స్‌లో పొందుతున్నారు. ఫలితంగా ఈ తరహా సోషల్ మీడియా యాప్స్‌కి క్రమక్రమంగా ఆధరణ కూడా పెరుగుతోంది. ఇటీవల కేంద్రం 59 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో ఈ కొత్తకొత్త యాప్స్‌కి ప్రాముఖ్యత పెరుగుతోంది. 
 ( Also read: Chinese apps banned: చైనా యాప్స్‌ నిషేధం.. స్పందించిన చైనా సర్కార్ )

ఇదిలావుంటే, చైనా యాప్స్‌పై భారత్ నిషేధం విధించడంపై చైనా ఆందోళన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని.. చైనా యాప్స్‌ని నిషేధించడం ఆందోళనకరమైన పరిణామం అని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News