Fun Emoji: ‘ఫన్ మోజీ’ యూట్యూబ్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా ఈ సంస్థ నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. అంతే కాకుండా డెమీ గాడ్ క్రియేటివ్స్ అంటూ వీఎఫ్ఎక్స్ సంస్థను కూడా ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. మన్వంతర మోషన్ పిక్చర్స్ అనే ఈ కొత్త ప్రొడక్షన్ కంపెనీలో ఆల్రెడీ ఓ సినిమాను స్టార్ట్ చేసినట్టు టీం తెలిపింది. ఈ క్రమంలో ఫన్ మోజీ టీం మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ తరుపున సుశాంత్ మహాన్, హరీష్, సంతోష్, సుధాకర్ రెడ్డి, సాత్విక్ మీడియాతో మాట్లాడారు.
సుశాంత్ మహాన్ మాట్లాడుతూ.. ‘యూట్యూబ్‌లో మా ఫన్ మోజీకి మిలియన్ల కొద్ది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అంతేకాదు మా వీడియోస్ కు బిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మా అందరినీ ఎంతగానో ఆదరించారు. ఇక ఇప్పుడు మేం సినిమా ప్రొడక్షన్‌లోకి కూడా రాబోతూన్నాము. దాంతో పాటుగా వీఎఫ్ఎక్స్ సంస్థను కూడా లాంఛ్ చేయబోతోన్నాం. ఆల్రెడీ మా వీఎఫ్ఎక్స్ సంస్థ డెమీ గాడ్ క్రియేటివ్స్ కిరణ్ అబ్బవరం నటిస్తోన్న ‘దిల్ రూబా’ సినిమా కోసం పని చేస్తోంది. మేం ముగ్గురిగా ప్రారంభించిన ఈ సంస్థలో ఇప్పుడు 40 మందికి పైగా ఉన్నాము.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
యూట్యూబ్‌లో మా అందరినీ ఆదరించినట్టుగానే సినిమాల్లోనూ మా అందరినీ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము. వీఎఫ్ఎక్స్ విషయంలో మన టాలీవుడ్ స్టాండర్డ్స్‌ని పెంచాలని అనుకుంటున్నాము. మున్ముందు ఇతర సంస్థలతోనూ కలిసి పని చేయాలని అనుకుంటున్నాము.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.