Jatadhara: సుధీర్ బాబు హీరోగా ‘జటాధర’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రేరణ అరోరాతో కలిసి నిర్మించేందుకు జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది. రుస్తుం తరువాత మళ్లీ ప్రేరణ అరోరాతో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేస్తోంది. . సూపన్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘జటాధర’ చిత్రంలోకి జీ స్టూడియోస్ ఎంట్రీ ఇవ్వడంతో టీంలో కొత్త ఉత్తేజం వచ్చినట్టైయింది. ఈ మేరకు జీ స్టూడియోస్ సీఈవో ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. ‘జీ స్టూడియోస్‌లో మేం ఎన్నోస్టోరీలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేసినట్టు చెప్పారు. జీ స్టూడియోస్ తరతరాలుగా ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. జటాధర థ్రిల్లింగ్ సూపర్ నేచురల్‌గా ఉండబోతోందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి ప్రేరణ అరోరాతో కలిసి పని చేయడం హ్యాపీగా ఉందన్నారు.
జటాధర సినిమా కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర చుట్టూ ఈ సినిమాను ఆధ్యాత్మికంగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. మొత్తంగా ఈ సినిమా అనేక అంశాలను ఈ మూవీలో చూపించబోతున్నట్టు చెప్పారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ హిస్టరీ, పురాణా కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం సుధీర్ బాబు పూర్తిగా ట్రాన్స్ ఫామ్ కాబోతున్నాడు. ఇందుకోసం కఠినమైన శిక్షణ కూడా తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఉమేష్ కెఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్, రాజీవ్ అగర్వాల్, అరవింద్ అగర్వాల్, నిఖిల్ నందా, మోనేష్ మంఘ్నానితో పాటు జీ స్టూడియోస్ బ్రాండ్ వ్యాల్యూ పెంచేలా ఈ జటాధర సినిమా ఉండనుంది. ఫిబ్రవరిలో జటాధర చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.