Rana in Brahma Rakshasa: హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ తీయబోతున్న బ్రహ్మ రాక్షస చిత్రం పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం ముందుగా రణవీర్ సింగ్ తో అనుకోగా.. పలు కారణాలవల్ల ఈ హీరో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. మరోపక్క ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞతో ప్రకటించిన సినిమా కూడా ప్రస్తుతం హోల్డ్ లో పడింది. ఈ క్రమంలో మళ్లీ బ్రహ్మ రాక్షస సినిమా గురించి ప్రశాంత్ వర్మ ఆలోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రంలో హీరో ఎవరు అనేది పెద్దగా క్లారిటీ రాలేదు.
కాగా ప్రస్తుతం అందుతున్న వార్తల ప్రకారం ఈ చిత్రంలో హీరో రానా నటించిన బోతున్నారు అని సమాచారం. ప్రసాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రానా అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రానా ఈ కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకోవటం అందరిని ఆసక్తికి గురిచేస్తోంది. ప్రసాంత్ వర్మ ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా చేసిన తర్వాత.. చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది అని సమాచారం.
రానా చివరిసారిగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విరాట పర్వం. 2022లో విడుదలైన ఈ సినిమా తర్వాత, రానాకు ఏ పెద్ద ప్రాజెక్టులు దక్కలేదు. దర్శకుడు తేజ దర్శకత్వంలో రాక్షస రాజు అనే సినిమా చేయాలనే చర్చలు జరిగాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. అనధికారికంగా ప్రాజెక్ట్ రద్దైనట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో, తేజ తన కుమారుడిని హీరోగా పరిచయం చేయడానికి దృష్టి సారించాడు. మరోవైపు, రానా ఎంతో ఆశతో ఎదురు చూసిన గుణశేఖర్ దర్శకత్వంలోని.. హిరణ్యకశిపు ప్రాజెక్ట్ కూడా నిలిచిపోయింది అనే వార్తలు ప్రస్తుతం ఐరన్ అవుతున్నా.
ఇవన్నీ జరిగినా, రానా పరిశ్రమలో విభిన్న పాత్రలతో కొనసాగుతూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన నిఖిల్ నటించిన స్పై, నవదీప్ నటించిన లవ్ మౌలీ, రజనీకాంత్ నటించిన వెట్టైయన్ వంటి చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించారు. అంతేకాక, అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఒక టాక్ షోను కూడా నిర్వహించారు.
ప్రసాంత్ వర్మ తొలుత బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌తో ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్నాడు. అయితే, రణవీర్ అనుకోకుండా ప్రాజెక్ట్ నుండి వైదొలగడం అతడికి షాక్ ఇచ్చింది. ఆ ప్రాజెక్ట్ కథను రానా దగ్గుబాటికి వివరించగా, రానా వెంటనే అంగీకరించినట్లు సమాచారం.
మరోపక్క ప్రసాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలాగే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో నిలిచిపోయిన సినిమా స్క్రిప్ట్ కూడా.. మళ్లీ మార్చి మోక్షజ్ఞతోనే చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఈ దర్శకుడు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక, బ్రహ్మ రాక్షస చిత్ర షూటింగ్ మొదలవుతుంది అని తెలుస్తోంది. రానా - ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.