Sankranthiki Vasthunnam Box Office Collections: చిన్న చిన్న చినుకులే తుపానుగా మారినట్టు.. సంక్రాంతి సినిమాల్లో తక్కువ బడ్జెట్ తో తక్కువ టైమ్ లో తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ తో సంక్రాంతి సీజన్ లో లాస్ట్ లో విడుదలైన వెంకటేష్ ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా ఒక్కో రికార్డు తుక్కు ఒదలగొడుతుంది. అంతేకాదు పలు రికార్డులను తన పేరిట రాసుకుంటోంది.
Sankranthiki Vasthunnam Box Office Records: ఒక్కొసారి సినీ పరిశ్రమలో కొన్ని అద్భుతాలు జరిగిపోతుంటాయి. అలాంటి అద్భుతం వెంకీమామ కథానాయకుడిగా నటించగా.. పొంగల్ పోటీలో విడులైన ఈ సినిమా పూటకో రికార్డు బద్దలు కొడుతోంది. సంక్రాంతి అతి తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా అందరి కంటే ఎక్కువ వసూళ్లను సాధిస్తోంది.
మొదటి నాలుగు రోజుల్లో పొంగల్ పోటీలో విడుదలైన ‘డాకు మహారాజ్’ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను బీట్ చేసిన ఈ సినిమా .. వారం రోజుల్లో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ లైప్ టైమ్ వసూళ్లను దాటేసి పరుగులు తీస్తోంది. ఒక రకంగా మన దేశంలో తొలి హిట్.. సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 41.50 కోట్ల ప్రీ రిలీజ్ కు గాను రూ. 122 కోట్ల షేర్ (రూ.250 కోట్ల గ్రాస్) వసూళ్లతో సంచలనం రేపింది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో సోలో హీరోగా తొలి రూ. 100 కోట్ల గ్రాస్..తో పాటు తొలి రూ. 100 కోట్ల షేర్ సాధించింది. అంతేకాదు తెలుగు స్టేట్స్ లో రూ. 100 కోట్ల కు పైగా షేర్ సాధించిన మూవీగా పలు రికార్డులను తిరగరాస్తోంది.
ఇప్పటి వరకు సంక్రాంతి సినిమాల్లో ‘అల వైకుంఠపురుములో’తో పాటు ప్యాన్ ఇండియా సంక్రాంతి చిత్రాల్లో హనుమాన్ టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఈ రెండు సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను దాటేసి నాన్ ప్యాన్ ఇండియా కేటగిరిలో ఓన్లీ తెలుగులో ఈ రేంజ్ వసూళ్ల సునామీ వెంకీ మామ బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేయడం అంటే మాములు విషయం కాదు.
మొత్తంగా ఫ్యామిలీస్ లో వెంకీ ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదనే విషయం మరోసారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రూవ్ అయింది. అంతేకాదు యూఎస్ బాక్సాఫీస్ $3 మిలియన్ డాలర్స్ కొల్లకొట్టే దిశగా అడుగులు వేస్తోంది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వెంకటేష్ .. చిరంజీవి, రజినీకాంత్, కమల్ హసన్ ల సరసన చేరారు. 60 ప్లస్ ఏజ్ లో రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాదు ఈ సినిమా దూకుడు దూస్తుంటే.. రూ. 300 కోట్ల క్లబ్బులో ప్రవేశించడం పక్కా అని చెబుతున్నారు.