Dil Raju IT Raids: సినీ పరిశ్రమను ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. దర్శకులు, నిర్మాతలు, ఇతర సినిమా సంబంధిత వ్యక్తులపై ఐటీ దాడులు కలకలం రేపుతున్న వేళ వీటిపై సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అతడితోపాటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందిస్తూ మాట్లాడారు. ఐటీ దాడులపై వారు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
Also Read: Pushpa 2 IT Raids: ఏయ్ కేశవా ఇంకెన్ని గండాలు? పుష్ప 2 సినిమాకు వదలని కష్టాలు
మొత్తం వైట్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా అద్భుత విజయం పొందడంతో మీడియా సమావేశం నిర్వహించగా.. ఈ సమావేశంలో సినీ నటుడు వెంకటేశ్ మాట్లాడుతూ ఐటీ దాడుల అంశంపై స్పందించారు. 'సినీ ప్రముఖులపై ఐటీ దాడులపై మీరేం అంటారు? అని మీడియా ప్రశ్నించగా.. 'ఐటీ దాడులు జరుగుతున్నాయా? నిజమా' అని ప్రశ్నించారు. మిగతా వారి గురించి నాకు తెలియదు. నేను నా రెమ్యునరేషన్ మొత్తం వైట్‌లో (నల్లధనం కాకుండా) తీసుకుంటా. నేను వైట్‌లో వైట్' అని వెంకటేశ్ చమత్కరించారు. 'అయినా నేను తీసుకునే రెమ్యునరేషన్ కూడా తక్కువే కదా!' అని విక్టరీ వెంకటేశ్ తెలిపారు.
Also Read: Tirumala Actors: తిరుమలలో 'సార్' హీరోయిన్ ప్రత్యేక పూజలు.. ఇతర ప్రముఖులు కూడా
ఆ స్థాయికి వెళ్లిపోయావు
సంక్రాంతికి వస్తున్నాం నిర్మాత దిల్ రాజు ఇంటిపై ఐటీ దాడుల అంశంపై దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మా ఫ్రెండ్ ఒకడు ట్విటర్‌లో నన్ను కోట్ చేస్తూ.. ఐటీ దాడులు జరిగే స్థాయికి వెళ్లిపోయావు అని పోస్టు చేశాడు' అని అనిల్ తెలిపాడు. 'నాపై ఎలాంటి ఐటీ దాడులు జరగలేదు' అని అనిల్ రావిపూడి స్పష్టం చేశాడు.
సోదాల వెనుక కుట్ర?
అనిల్ దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే. జనవరి 14వ తేదీన విడుదలై ఇంటిల్లిపాదిని ఆకర్షిస్తోంది. అత్యధిక షోలతో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పటివరకు రూ.230 కోట్లు వసూలు చేసింది. ఈ వసూళ్లు ఐటీ శాఖ దాడులకు కారణమైంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌తోపాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను విడుదల చేయడంతో ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేసి దిల్ రాజు ఆర్థిక లావాదేవీలు పరిశీలించారు. ఈ పరిణామం ఎలాంటి వైపు మలుపు తీసుకుంటాయోనని చర్చ జరుగుతోంది. కాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ఐటీ దాడులు జరగడం వెనుక కుట్ర దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మిగతా Heroes గురించి నాకు తెలియాదు.. నేను మాత్రం WHITE లోనే తీసుకుంటా .
— Gulte (@GulteOfficial) January 23, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook