కరోనావైరస్ లక్షణాలు ఉన్న అనుమానితులను నిర్దేశిత ఆస్పత్రులకు తీసుకెళ్లడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఫలితంగా వైరస్ వ్యాపించే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కార్ ఓ కొత్త పరిష్కారాన్ని కనుగొంది. ఇకపై అనుమానితులు తమ శాంపిళ్లు ఇవ్వడానికి ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఇళ్ల వద్దకే ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లి బ్లడ్ శాంపిల్స్ సేకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
ఏప్రిల్ నెల పన్నుల్లో భాగంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్రం విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి 46వేల 38 కోట్లు రూపాయలు విడుదల చేయగా అందులో తెలంగాణకు రూ. 982 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్‌కి రూ.1,892.64 కోట్ల రూపాయలు లభించాయి.
తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బ్యాంక్ ఖాతాలతో ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేసుకోని వారి ఖాతాల్లో నగదు జమ కాకపోవడం నిజమేనన్న ఆయన.. అలా ఖాతాలో నగదు జమ కాని వారికి నేరుగానే నగదు అందిస్తామని తెలిపారు.
తెలంగాణలో శనివారం కొత్తగా మరో 43 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన 43 కరోనా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 31 కేసులు నమోదు కాగా, గద్వాల్ జిల్లాలో 7, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో ఒకటి ఉన్నాయి.
తెలంగాణలో గురువారం కొత్తగా మరో 50 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 700 మార్కును చేరుకున్నట్టయింది. నేడు రాష్ట్రంలోని ఆస్పత్రుల నుంచి 68 మంది డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 650కి చేరింది. తెలంగాణలో బుధవారం కొత్తగా నమోదైన 6 కరోనా పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 650కి చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
తెలంగాణలో ఏప్రిల్ 13, సోమవారం నాడు రాత్రి 10 గంటల వరకు కొత్తగా 61 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించగా, మరొకరు కరోనాతో మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈమేరకు సోమవారం రాత్రి 10 గంటలకు తెలంగాణ సర్కార్ ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తెలంగాణలో ఏప్రిల్ 8, బుధవారం నాడు కూడా భారీ సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. బుధవారం కొత్తగా మరో 49 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనావైరస్ సోకిన వారి మొత్తం సంఖ్య 453కు చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
తెలంగాణలో శనివారం నాడు కొత్తగా మరో 43 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన ఈ గణాంకాల ప్రకారం తాజాగా తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య 272కి చేరుకుంది.
తెలంగాణలో శుక్రవారం ఇద్దరు కరోనావైరస్ పాజిటివ్ రోగులు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మరోవైపు కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏరోజుకు ఆరోజు భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
శ్రీరాముని అనుగ్రహము ప్రజలందరిపై ఉండాలని... అంతా శుభం కలగాలని మంత్రి హరీష్ రావు ఆ భగవంతుడిని కోరుకున్నారు. ప్రభుత్వం చెప్పే సూచనలు పాటిస్తూ కరోనా మహమ్మారిని పారదోలుదామని మంత్రి హరీష్ రావు స్పష్టంచేశారు.
మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో (Maharashtra-Telangana border) మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పోలీసులు అనుమానంతో ఆ రెండు ట్రక్కులను ఆపి తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది.
రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం (Revanth Reddy`s arrest) పార్లమెంట్‌కు చేరింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతున్న కాంగ్రెస్ నేతలను తెలంగాణ సర్కార్ (Telangana govt) తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని.. అందులో భాగంగానే రాజకీయంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై పైచేయి సాధించడానికే ఆయన్ను అక్రమ అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభ స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు.
మంత్రి మల్లారెడ్డిపై మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి పలు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి మల్లా రెడ్డి కార్మిక శాఖ మంత్రిగా ఉంటూనే కార్మికుల పొట్టకొట్టడంతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరించారని మల్లా రెడ్డిపై నాయిని నర్సింహా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే–హెచ్143) ఢిల్లీ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో జరిగిన యూనియన్ సమావేశంలో సభ్యులు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన కల్పించే లక్ష్యంతో బీజేపి ఈ సభను ఏర్పాటు చేస్తోంది. తొలుత మార్చి 7 లేదా 14 తేదీల్లో ఈ సభ నిర్వహించేందుకు వ్యూహం రచించినప్పటికీ.. ఆ తర్వాత మార్చి 15వ తేదీని ఫైనల్ చేసుకున్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్టంలోని ఎస్టి గురుకుల డిగ్రీ కళాశాలలో 15 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
2018 జులై నుండి అమలు చేయాల్సి ఉన్న పీఆర్సీని (PRC) తెలంగాణ సర్కార్ మరోసారి ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై స్పందించిన తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ( TSUTF ).. టీచర్స్ పట్ల సర్కార్ దారుణంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది.
ఫిబ్రవరి 7న తెలంగాణ సీఎం కేసీఆర్ చివరి దశ మెట్రో రైలు ప్రాజెక్టు జేబిఎస్-ఎంజిబిఎస్ కారిడార్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం విచారం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.