వాళ్ల ఖాతాల్లో మాత్రమే డబ్బులు పడలేదు

తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బ్యాంక్‌ ఖాతాలతో ఆధార్‌ కార్డు నెంబర్ లింక్‌ చేసుకోని వారి ఖాతాల్లో నగదు జమ కాకపోవడం నిజమేనన్న ఆయన.. అలా ఖాతాలో నగదు జమ కాని వారికి నేరుగానే నగదు అందిస్తామని తెలిపారు.

Last Updated : Apr 19, 2020, 12:15 AM IST
వాళ్ల ఖాతాల్లో మాత్రమే డబ్బులు పడలేదు

హైదరాబాద్‌: తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బ్యాంక్‌ ఖాతాలతో ఆధార్‌ కార్డు నెంబర్ లింక్‌ చేసుకోని వారి ఖాతాల్లో నగదు జమ కాకపోవడం నిజమేనన్న ఆయన.. అలా ఖాతాలో నగదు జమ కాని వారికి నేరుగానే నగదు అందిస్తామని తెలిపారు. 5,21,640 మందికి వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయలేకపోయామని చెబుతూ.. వాళ్లందరికీ నేరుగా కానీ లేదా తపాలా ద్వారా నగదు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్యాంకులో పడిన నగదును డ్రా చేసుకోకపోతే ఆ డబ్బులు వెనక్కి వెళ్లిపోతున్నాయనే పుకార్లలో నిజం లేదని.. అవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని శ్రీనివాస్ రెడ్డి స్పష్టంచేశారు. ఆ నగదును ఎప్పుడైనా ఖాతాలోంచి ఉపసంహరించుకోవచ్చని.. వదంతులు నమ్మి బ్యాంకుల వద్ద భారీ సంఖ్యలో గుమికూడొద్దని విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఎస్బీఐ బ్యాంకు కూడా స్పష్టంగా చెప్పినప్పటికీ.. దీనిపై వదంతులు వ్యాపిస్తూనే ఉన్నాయని అన్నారు.

బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వలస కార్మికులకు సైతం ప్రతీ కుటుంబానికి 12 కిలోల చొప్పున బియ్యం, రూ.500 నగదు అందించి వారికి తెలంగాణ సర్కార్ అండగా నిలబడిందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Trending News