Coronavirus updates from Telangana: తెలంగాణలో ఒకే రోజు 49 పాజిటివ్ కేసులు

తెలంగాణలో ఏప్రిల్ 8, బుధవారం నాడు కూడా భారీ సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. బుధవారం కొత్తగా మరో 49 కరోనావైరస్ పాజిటివ్‌ కేసులు నమోదవడంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనావైరస్ సోకిన వారి మొత్తం సంఖ్య 453కు చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

Last Updated : Apr 9, 2020, 04:00 AM IST
Coronavirus updates from Telangana: తెలంగాణలో ఒకే రోజు 49 పాజిటివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో ఏప్రిల్ 8, బుధవారం నాడు కూడా భారీ సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. బుధవారం కొత్తగా మరో 49 కరోనావైరస్ పాజిటివ్‌ కేసులు నమోదవడంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనావైరస్ సోకిన వారి మొత్తం సంఖ్య 453కు చేరిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. 453 మందిలో ఇప్పటివరకు 45 మంది డిశ్చార్జి కాగా మరో 11 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. అలా డిశ్చార్జ్ అయిన వారు, మృతి చెందిన వారు కాకుండా ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఇంకా 397 మంది చికిత్స పొందుతున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు తెలిపారు. విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉంటున్న వాళ్లు అందరికీ గురువారం నుంచి విముక్తి కలుగుతుందని మంత్రి ఈటల స్పష్టంచేశారు. కమాండ్‌ కంట్రోల్‌ రూంలో బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి ఈటల ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు.

Also read : EPF withdrawal: కరోనా క్రైసిస్‌లో ఆర్థిక ఇబ్బందులు తీరాలంటే ఇలా చేయండి

తెలంగాణ నుంచి మర్కజ్‌కి వెళ్లొచ్చిన 1,100 మందికీ కోవిడ్-19 పరీక్షలు చేయించాం. మర్కజ్‌కు సంబంధించిన వారిలో మరో 535 మంది శాంపిళ్లు సేకరించి పంపించాం. గురువారం సాయంత్రానికి వాటి ఫలితాలు కూడా వెల్లడవుతాయి. మర్కజ్‌కి వెళ్లొచ్చిన వాళ్లే కాకుండా వాళ్ల కుటుంబసభ్యులు, సంబంధీకులు, వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారు అందరూ కలిపి ప్రస్తుతం 167 సెంటర్లలో 3,158 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. మర్కజ్‌ వెళ్లొచ్చిన వారు ఈ నెల 21 వరకు ఇళ్లల్లోనే క్వారంటైన్‌లో ఉండాల్సిందే. పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ నిత్యం వీరి కదలికలపై నిఘా పెడుతుందని తెలిపారు. మర్కజ్‌కి వెళ్లొచ్చి వాళ్లతో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారు ఏప్రిల్ 28 వరకు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని మంత్రి ఈటల తేల్చిచెప్పారు. 

Also read : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు లేటెస్ట్ అప్‌డేట్

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎక్విప్‌మెంట్:
తెలంగాణలో ప్రస్తుతం 80 వేల పీపీఈ కిట్స్(PPE kits), లక్షకు పైగా ఎన్‌–95 మాస్కులు (N-95 masks) సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇంకో 5 లక్షల పీపీఈ కిట్లు, 5 లక్షల మాస్కులు, కోటికి పైగా హ్యాండ్‌ గ్లవ్స్‌లు (Hand gloves) ఆర్డర్‌ చేసినట్టు చెప్పారు.

Also read : PM Modi about lockdown: లాక్ డౌన్ ఎత్తివేయడంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

104కు డయల్ చేయండి:
ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నారని అనిపిస్తే... వెంటనే 104 కి కాల్ చేసి అవసరమైన వైద్య సహాయం తీసుకోవాల్సిందిగా మంత్రి ఈటల సూచించారు. ఎవరికైనా దగ్గు, జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే.. వారే స్వచ్చందంగా ప్రభుత్వ ఆస్పత్రులను సంప్రదించి చికిత్స తీసుకోవాల్సిందిగా మంత్రి ఈటల విజ్ఞప్తిచేశారు. వదంతులను నమ్మి ప్రజలు భయాందోళనకు గురికావొద్దని.. తెలంగాణ ప్రభుత్వం వైరస్‌ను నివారించడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News