Telangana Assembly Sessions Updates: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. అప్పులు కాదు ఆస్తులు సృష్టించామని చెబుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇంకా అబద్దాలతో సభను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని అన్నారు. అబద్దాలతో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని.. ఇప్పుడేమో సత్యహరిశ్చంద్రుల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
"కాంగ్రెస్ సృష్టించిన సంపదను తనఖా పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చింది. కాంగ్రెస్ కూడబెట్టిన రూ.4,972 కోట్ల విద్యుత్ శాఖ ఆస్తులను బీఆర్‌ఎస్ తనఖా పెట్టింది. గత ప్రభుత్వం పదేళ్లలో రూ.13 లక్షల 72వేల కోట్లు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేసినా.. ప్రజలకు చేసిందేం లేదు.. పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వలేదు. దళితులకు మూడెకరాలు ఇవ్వలేదు. ఫీజు రీఎయింబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వలేదు.. రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయని పరిస్థితి.. మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. సెక్రటేరియట్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి.
ప్రతీ నెలా మొదటి తారీఖున రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి.. పెద్దకొడుకును అని చెప్పుకున్న పెద్దమనిషి ఆసరా పెన్షన్లు ఇవ్వని పరిస్థితికి తీసుకొచ్చారు. నాలుగు నెలల ముందే వైన్స్ టెండర్లు వేసి ఉన్నదంతా దోచుకున్నారు.. రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం సృష్టించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని బీఆర్ఎస్ నెరవేర్చలేదు. లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు.. ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి కడతామన్నారు. నిజాలు చెబితే పరువు పోతుందంటున్నారు. కేసీఆర్ సిగ్గు కాపాడాలా..? తెలంగాణను కాపాడాలా..? కానీ ఊరుకుంటే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి. అందుకే వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నాం.." అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook