ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ షర్మిల టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం రోజు గుడివాడ ఎన్నికల ప్రచార సభలో షర్మిల ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా నినాదం ఇప్పటి వరకు బదికి ఉందంటే అది వైసీపీ వాయిస్ వల్లేనని..హోదా క్రెడిట్ జగన్ కే దక్కుతుందని పేర్కొన్నారు. గత ఐదేళ్ల కాలంలో ప్రత్యేక హోదా గురించి జగనన్న ఎన్నిసార్లు పోరాటం చేశారో ప్రజలు తెలుసున్నారు.
ఏపీ స్పెషల్ స్టేషస్ కోసం ఢిల్లీ వీధుల్లో రాజకీయ పార్టీలు , ప్రజా సంఘాల ఆందోళన కొనసాగుతోంది. విభజన హామీల కోసం రెండు రోజులగా పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఏపీ ఎంపీలు గట్టిగా నిలదీస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఎంపీల ధర్న చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ స్ట్రీట్ లో ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద వైసీపీ నేతలు ఆందోళన కొనసాస్తున్నారు. ప్రజా సంఘాలు పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడంతో ప్రత్యేక హోదా సెగ ఢిల్లీ పెద్దలకు తాకింది.
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని మరో సారి స్పష్టం చేసింది. ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఏపీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం ఆర్ధిక శాఖ కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. నిన్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో ఏపీ ఆర్ధిక మంత్రి యనమల భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి యనమలకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని జైట్లీ తేల్చిచెప్పారు. ఈ సందర్భంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని యనమల గట్టిగా అడిగినట్లు తెలిసింది. అయితే ఏపీకి హోదా ఇవ్వలేమని ప్యాకేజీ మాత్రమే అమలు చేస్తామని చెప్పినట్లు తెలిసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.