Rs 2000 Notes Last Date: సెప్టెంబర్ 30వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం అప్పటికే 93 శాతం వరకు 2 వేల రూపాయల నోట్లు బ్యాంకుల వద్దకు తిరిగి వచ్చేశాయి. సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఆర్బీఐ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం.. 24 వేల కోట్ల రూపాయల విలువైన 2 వేల రూపాయల నోట్లు మాత్రమే ఇంకా బ్యాంకుల వద్దకు రాకుండా ప్రజల వద్ద చలామణిలో ఉన్నాయి.
RBI About Rs 2000 Notes: రూ. 2 వేల నోట్లను చలామణి నుండి విత్‌డ్రా చేసుకుంటున్నట్టుగా మే 19వ తేదీన ఆర్బీఐ ప్రకటించింది. అదే సమయంలో నోట్ల డిపాజిట్ లేదా నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు తుది గడువు ఉంటుంది అని స్పష్టంచేసింది.
Reserve Bank of India on Rs 2000 Notes: రూ.2.72 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లు బ్యాంకింగ్ సెక్టార్‌లోకి తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇంకా రూ.84 వేల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయని.. సాధ్యమైనంత త్వరగా డిపాజిట్ చేసుకోవాలని సూచించింది.
Rs 2,000 Notes News: చలామణి నుంచి రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించిన అనంతరం రూ. 1.80 లక్షల కోట్ల విలువైన రూ 2,000 నోట్లు బ్యాంకుల వద్దకు చేరుకున్నాయి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
Operation Pink: పిపి జువెలర్స్, త్రిభువన్దాస్ భీమ్‌జి జవేరి జువెలర్స్ వంటి ఫేమస్ జువెలరీ షోరూమ్స్ ఈ చీకటి దందాలో పాల్పంచుకుంటూ బడా బాబులు తమ వద్ద ఉన్న రూ. 2,000 నోట్లు గోల్డ్ కాయిన్స్‌తో ఎక్స్చేంజ్ చేసుకునేందుకు సహకరిస్తున్నాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే... ఇప్పటివరకు రూ. 2 వేల నోట్ల కట్టలు పోగేసుకున్న బడా బాబుల వద్ద ఇప్పుడు ఆ నల్లధనం వైట్ అవుతోంది.
ఆర్బీఐ రూ.2వేల నోట్లను ప్రింట్ చేయడం ఆపేసినట్లు వెలువడిన వార్తలు అనేక సందేహాలకు తావిచ్చాయి. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ పిటిషన్‌కి ఆర్బీఐ సమాధానం ఇస్తూ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్బీఐ ఎప్పటికప్పుడు ప్రతీ ఏడాది రూ.2వేల నోట్ల ముద్రణను తగ్గిస్తూ వచ్చినట్టుగా వెల్లడైన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.