Rs 2,000 Notes: రూ. 2 వేల నోట్లు ఎన్ని లక్షల కోట్లు వెనక్కి వచ్చాయంటే..

Rs 2,000 Notes News: చలామణి నుంచి రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించిన అనంతరం రూ. 1.80 లక్షల కోట్ల విలువైన రూ 2,000 నోట్లు బ్యాంకుల వద్దకు చేరుకున్నాయి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

Written by - Pavan | Last Updated : Jun 8, 2023, 04:43 PM IST
Rs 2,000 Notes: రూ. 2 వేల నోట్లు ఎన్ని లక్షల కోట్లు వెనక్కి వచ్చాయంటే..

Rs 2,000 Notes News: చలామణి నుంచి రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించిన అనంతరం రూ. 1.80 లక్షల కోట్ల విలువైన రూ 2,000 నోట్లు బ్యాంకుల వద్దకు చేరుకున్నాయి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రకటన వెలువడక ముందు చలామణిలో ఉన్న 2 వేల నోట్లలో 50 శాతం నోట్లు వెనక్కి వచ్చేశాయి అని ఆర్బీఐ స్పష్టంచేసింది. తాజాగా బై-మంత్లీ మానిటరీ పాలసీ విడుదల అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

2023, మార్చి 31 నాటికి... అంటే 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 3.62 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు తెలిపారు. ఆర్బీఐ చట్టం, 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం 2016 నవంబర్‌లో రూ. 1000 నోట్లు, రూ. 500 నోట్లను చట్టబద్ధంగా రద్దు చేసిన తరువాత అప్పట్లో కేంద్రం తీసుకున్న మరో సంచలన నిర్ణయం 2 వేల నోట్లను ప్రవేశపెట్టడం. అప్పట్లో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం నిర్ణయంతో నల్ల ధనాన్ని వెలికి తీయడం కాదు.. నల్లధనాన్ని దాచుకోవడానికి పని సులువుగా చేసినట్టుగా ఉంది అంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.

ఇదిలావుంటే, పాత పెద్ద నోట్ల రద్దు అనంతరం తీసుకొచ్చిన 2 వేల నోట్లను తిరిగి చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఇటీవల కేంద్రం చేసిన మరో ప్రకటన కూడా అంతే విమర్శలపాలైంది. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి సర్కారు మాత్రం ఆర్థిక వ్యవస్థలోని కరెన్సీ అవసరాలను తీర్చాలనే లక్ష్యంతోనే రూ.2000 నోటును ప్రవేశపెట్టామని... కేంద్రం అనుకున్న లక్ష్యం నెరవేరడంతో పాటు ఇతర డినామినేషన్లలో అవసరాలకు అనుగుణంగా నోట్లు అందుబాటులోకి రావడం వల్లే 2018-19లో రూ. 2000 నోట్ల ప్రింటింగ్‌ని నిలిపివేసినట్టుగా స్పష్టంచేసింది. 

రూ.2000 డినామినేషన్ నోట్లలో అత్యధిక భాగం మార్చి 2017కి ముందే జారీ అయ్యాయి. ఇక ఇతర డినామినేషన్ నోట్లు ప్రస్తుతం దేశ ప్రజల కరెన్సీ అవసరాలకు సరిపోయే మోతాదులో ఉన్నాయి. అందుకే “ క్లీన్ నోట్ పాలసీ ” ప్రకారం రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చిచెప్పింది.

Trending News