Rs 2000 Notes Last Date: 2 వేల నోటుకు సమయం లేదు మిత్రమా

Rs 2000 Notes Last Date: సెప్టెంబర్ 30వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం అప్పటికే 93 శాతం వరకు 2 వేల రూపాయల నోట్లు బ్యాంకుల వద్దకు తిరిగి వచ్చేశాయి. సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఆర్బీఐ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం.. 24 వేల కోట్ల రూపాయల విలువైన 2 వేల రూపాయల నోట్లు మాత్రమే ఇంకా బ్యాంకుల వద్దకు రాకుండా ప్రజల వద్ద చలామణిలో ఉన్నాయి.

Written by - Pavan | Last Updated : Sep 28, 2023, 10:22 PM IST
Rs 2000 Notes Last Date: 2 వేల నోటుకు సమయం లేదు మిత్రమా

Rs 2000 Notes Last Date: రూ. 2 వేల నోట్లను తాత్కాలిక చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ చేసిన సంచలన ప్రకటన మీకు గుర్తుండే ఉంటుంది. రూ. 2 వేల నోట్లను చలామణి నుండి విత్‌డ్రా చేసుకుంటున్నట్టుగా మే 19వ తేదీన ఆర్బీఐ చేసిన ప్రకటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా అదొక ఇంట్రెస్టింగ్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.  2 వేల నోట్లను బ్యాంకుల వద్ద మార్చుకోవడానికైనా లేదా తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడానికైనా ఈ నెల 30వ తేదీ వరకు తుది గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంటే ఈ పని పూర్తి చేయడానికి మరో రెండు రోజులే గడువు మిగిలి ఉందన్నమాట. మరి ఈ సెప్టెంబర్ 30 వ తేదీ తుది గడువు దాటిపోతే ఆ తరువాత ఏం చేయాల్సి ఉంటుంది అనేదానిపైనే ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. 

సెప్టెంబర్ 30వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం అప్పటికే 93 శాతం వరకు 2 వేల రూపాయల నోట్లు బ్యాంకుల వద్దకు తిరిగి వచ్చేశాయి. సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఆర్బీఐ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం.. 24 వేల కోట్ల రూపాయల విలువైన 2 వేల రూపాయల నోట్లు మాత్రమే ఇంకా బ్యాంకుల వద్దకు రాకుండా ప్రజల వద్ద చలామణిలో ఉన్నాయి. ఆగస్టు 31వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులలో నమోదైన లావాదేవీల ప్రకారం ఆర్బీఐ ఈ వివరాలు వెల్లడించింది.

బ్యాంకుల వద్దకు తిరిగి వచ్చిన 2 వేల రూపాయల నోట్ల మొత్తం విలువ 3.32 లక్షల కోట్లు ఉంటుందని ఆర్బీఐ స్పష్టంచేసింది. బ్యాంకుల వద్దకు వచ్చిన రూ 2000 నోట్లలో 87 శాతం కరెన్సీ నోట్లు డిపాజిట్స్ రూపంలో రాగా.. మిగతావి బ్యాంకుల వద్ద జనం నోట్లను మార్చుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇక ఆర్బీఐ ఇచ్చిన గడువు ప్రకారం రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికైనా లేదా మార్చుకోవడానికైనా మరో రెండు రోజులు గడువు మాత్రమే మిగిలి ఉంది. 

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఎవరైనా ఒక వ్యక్తి ఒక్క రోజుకు బ్యాంకు నుండి రూ. 20,000 వరకు.. అంటే 10 నోట్లు వరకు మార్చుకునేందుకు అవకాశం ఉంది. నోట్లను మార్చుకోవడానికి పరిమితి ఉంది కానీ డిపాజిట్స్‌పై ఎలాంటి పరిమితి లేదు. అయితే, డిపాజిట్స్‌పై పరిమితి లేనప్పటికీ.. లెక్కకు మించి రూ వేల నోట్లు డిపాజిట్ చేసే వారు తమ PAN కార్డు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనే విషయం తెలిసిందే.

తుది గడువు పొడిగిస్తారా ?
సెప్టెంబర్ 30 వ తేదీ తుది గడువుకు మరో రెండు రోజులే మిగిలి ఉంది. తుది గడువు పొడిగిస్తారా లేదా అనేది ఆ రోజు కానీ లేదా ఆ మరునాడు అక్టోబర్ 1వ తేదీ నాడు వెల్లడించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. ఆగస్టు 31 నాటికే 93 శాతం నోట్లు ఆర్బీఐ వద్దకు వచ్చేశాయి. ఈ గడిచిన నెల రోజుల్లో మిగతా నోట్లు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక ఇంకా తుది గడువు పొడిగించే అవకాశం ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Trending News