Operation Pink: నల్లధనాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆర్బీఐ రూ. 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ వాస్తవానికి బయట సీన్ అలా లేదు. తాజాగా జీ న్యూస్ స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేరు మోసిన జువెలరీ బిజినెస్ షోరూమ్స్ యజమానులు బడా బాబులు విసిరే కాసులకు కక్కుర్తి పడి వారు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను ఎక్స్‌చేంజ్ చేసుకునేందుకు సహకరిస్తున్నారు.
వీళ్లు చేస్తోన్న ఈ చీకటి వ్యాపారానికి ఒక కోడ్ లాంగ్వేజ్ కూడా ఉంది. ఆ కోడ్ భాష పేరే " పింక్ " . రూ.2000 నోట్లు ఉండేది పింక్ కలర్‌లో కనుక ఈ చీకటి దందాకు వీళ్లు " పింక్ " అనే పేరు పెట్టుకున్నారు. రూ. 2 వేల నోట్లు తీసుకుని అందుకు బదులుగా గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నారు. జీ న్యూస్ ప్రతినిధి అభిషేక్ కుమార్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ పింక్‌లో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి.
రూ. 2 వేల నోట్లు తీసుకుని గోల్డ్ కాయిన్స్ ఇస్తే.. అందుకు బదులుగా బంగారం వ్యాపారులకు మిగిలేది ఏంటి అనే కదా మీ సందేహం.. అక్కడికే వస్తున్నాం. వాస్తవానికి ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ఖరీదు రూ. 63,000 ఉండగా.. వీళ్లు రూ. 2 వేల నోట్ల మార్పిడికి బదులుగా అదే తులం బంగారానికి రూ. 70 వేల వరకు చార్జ్ చేస్తున్నారు. అంటే రూ. 10 గ్రాముల బంగారం విక్రయంపై రూ. 7 వేల వరకు అదనపు లాభం అన్నమాట. బయటి నుంచి చూసే వారికి వీళ్లు చేసేది బంగారం వ్యాపారం.. లోలోపల జరిగేది నోట్ల మార్పిడి చీకటి దందా.
పిపి జువెలర్స్, త్రిభువన్‌దాస్ భీమ్‌జి జవేరి జువెలర్స్ వంటి ఫేమస్ జువెలరీ షోరూమ్స్ ఈ చీకటి దందాలో పాల్పంచుకుంటూ బడా బాబులు తమ వద్ద ఉన్న రూ. 2,000 నోట్లు గోల్డ్ కాయిన్స్‌తో ఎక్స్‌చేంజ్ చేసుకునేందుకు సహకరిస్తున్నాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే... ఇప్పటివరకు రూ. 2 వేల నోట్ల కట్టలు పోగేసుకున్న బడా బాబుల వద్ద ఇప్పుడు ఆ నల్లధనం వైట్ అవుతోంది. అది కూడా గోల్డ్ కాయిన్స్ రూపంలో సేవ్ చేసుకుంటున్నారు. అంటే నల్లధనం బయటికి రాకుండానే, ఆ దొంగలు ఎవరో తేలకుండానే ఆ బ్లాక్ మనీ మొత్తం వైట్ అవుతోందన్నమాట.
ఇది కూడా చదవండి : Rs 2,000 Notes News: బాగా డబ్బున్నోళ్లు 2 వేల నోట్లను ఏం చేస్తున్నారో తెలుసా ?
జువెలరీ దుకాణాలు భారీ మొత్తంలో లావాదేవీలు చేస్తుండటం, పైగా వారికి ఎలాంటి రికార్డు ఎంట్రీ లేకుండానే బ్యాంకుల్లో రూ. 2 వేల నోట్లు జమ చేసేందుకు అవకాశం ఉండటంతో ఆ అవకాశాన్నే బ్యాంకులు దుర్వినియోగం చేస్తూ ఈ చీకటి దందాకు తెరతీశాయి అని జీ న్యూస్ ప్రతినిధి అభిషేక్ కుమార్ జరిపిన ఆపరేషన్ పింక్ స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైంది. విచిత్రం ఏంటంటే.. దేశంలో చట్టాలను చేసే అత్యున్నత చట్టసభ పార్లమెంట్‌తో పాటు నల్లధనాన్ని వెలికితీయడంలో కీలక పాత్ర పోషించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్‌కి కూతవేటు దూరం నుంచి 20 కిమీ పరిధిలోనే ఈ బ్లాక్ మనీ దందా జరుగుతుండటం కొసమెరుపు. జీ న్యూస్ జరిపిన ఈ స్టింగ్ ఆపరేషన్‌లో వెలుగుచూసిన ఈ నిజాలపై కేంద్రం, ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకోనుందో వేచిచూడాల్సిందే మరి.
ఇది కూడా చదవండి : RBI About 2,000 Notes: 2 వేల నోటు మార్పిడి, గడువుపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు
ఇది కూడా చదవండి : CIBIL Score Without Loans: అసలు క్రెడిట్ హిస్టరీనే లేనప్పుడు సిబిల్ స్కోర్ పెంచుకోవడం ఎలా ?
ఇది కూడా చదవండి : RBI New Guidelines On Rs 2000 Notes: సెప్టెంబర్ 30 వరకు 100 రోజులు.. బ్యాంకులో మొత్తం ఎంత మార్చుకునే ఛాన్స్.. దీని వెనుకున్న మ్యాథ్స్ ఏంటో తెలుసా ?