Reserve Bank of India on Rs 2000 Notes: 2000 రూపాయల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినప్పటి నుంచి ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు తొందపడుతున్నారు. మే 19 ఆర్‌బీఐ నుంచి ప్రకటన రాగా.. జూన్ 30వ తేదీ వరకు రూ.2.72 లక్షల కోట్లు బ్యాంక్‌కు తిరిగి వచ్చాయి. అంటే చెలామణిలో రూ.2000 నోట్లలో 76 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం రూ.84 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయని పేర్కొంది. మిగిలిన నోట్లను సెప్టెంబరు 30వ తేదీలోగా బ్యాంకులో డిపాజిట్ చేయాలని ప్రజలకు సూచించింది. మే 19న నోట్ల రద్దు ప్రకటన వెలువడే సమయానికి రూ.3.56 లక్షల కోట్లు చెలమాణిలో ఉన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం బ్యాంకులకు తిరిగిన వచ్చన నోట్లలో 87 శాతం బ్యాంక్ అకౌంట్లలో జమ చేసుకున్నారని ఆర్‌బీఐ తెలిపింది. మిగిలిన 13 శాతం ఇతర డినామినేషన్లలోకి మార్చుకున్నట్లు వెల్లడించింది. వచ్చే మూడు నెలల్లో మీ సమయాన్ని చూసుకుని రూ.2000 నోట్లను డిపాజిట్ చేయాలని లేదా మార్చుకోవాలని ఆర్‌బీఐ ప్రజలకు సూచించింది. చివరి రోజుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత త్వరలో నోట్లను మార్చుకోవాలని కోరింది.
2016 నవంబర్‌లో రూ.500, రూ.1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాత 500, 1000 రూపాయల నోట్లను రాత్రికి రాత్రే నిషేధించింది. కొత్తగా రూ.500 నోటుతోపాటు రూ.2000 వేల నోటును కూడా మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది మే 19న క్లీన్ నోట్ పాలసీ కింద రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
డిపాజిట్ మిషన్ల ద్వారా లేదా బ్యాంకులకు వెళ్లి రూ.2 వేల నోటును మార్చుకోవచ్చు. డిపాజిట్ మెషీన్‌లో ఎంతైనా డిపాజిట్ చేసుకునే అవకాశం ఉండగా.. బ్యాంక్‌లో ఒక రోజుకు రూ.20 వేల వరకు మార్చుకునే ఛాన్స్ ఉంది. అన్ని బ్యాంకులు స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేశాయి. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా.. రూ.2 వేల నోటును మార్చుకోవచ్చు.
Also Read: AP Pension Scheme: జగన్ సర్కారు శుభవార్త.. త్వరలో రెండో పెన్షన్..?
Also Read: BJP New Presidents: బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం.. బండి సంజయ్, సోము వీర్రాజు అధ్యక్షులుగా తొలగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook