Telangana Rain updates: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టి వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీరు దిగువకు వదులుతున్నారు.
Hyderabad Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. వరదలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Heavy Rains In Hyderabad: నగరంలో అనేక చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఇప్పటికే రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.
Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌లో నిత్యం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజలకు సూచించారు.
Hyderabad on Red alert due to heavy rains: హైదరాబాద్: ఇప్పటికే నిత్యం పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాలతో సతమతం అవుతున్న హైదరాబాద్‌లో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు నగరానికి వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Hyderabad Rains Latest Updates: వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారంగానే నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, బోరబండ, రహమత్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
Asaduddin Owaisi Tweet Over Hyderabad Rains and Floods | టాలీవుడ్ నటీనటులు, దర్శకులు, ఇతర మూవీ యూనిట్ వర్గాలు తమ వంతు సాయాన్ని విరాళాల రూపంలో ప్రకటించారు. హైదరాబాద్ వరదలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించారు.
బేగంపేటలోని షేక్‌పేటలో అత్యధికంగా 43మిల్లీమీటర్లు, ఆ తర్వాత ఈస్ట్ మారేడ్‌పల్లిలో 37.3 మిమి, మల్కాజిగిరిలో 30.3 మి.మి వర్షపాతం నమోదైనట్టుగా తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ పేర్కొంది. సఫీల్‌గూడ, మల్కాజిగిలో 7 మిమి అత్యల్ప వర్షపాతం నమోదైంది.
వేసవి వేడి, మండుటెండల నుంచి కొంత ఉపశమనం కలిగిస్తూ హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం పలు చోట్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూభ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.