Hyderabad Rains: హైదరాబాద్ మహా నగర వాసులకు ఎండల నుంచి భారీ ఉపశమనం లభించింది. హైదరాబాద్‌లో బుధవారం ఉదయం పలు చోట్ల కరుస్తోంది. వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారంగానే నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, మాదాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, బోరబండ, రహమత్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
వరుసగా మూడు రోజులపాటు వర్షాలు కురవనున్న నేపథ్యంలో మున్సిపల్, డీఆర్‌ఎఫ్ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి శుక్రవారం వరకు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం, ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉదయం నుంచి పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. భద్రాచలంలో అత్యధికంగా 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు భారీ వర్షాలు చేసిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు అప్రమత్తం అయ్యారు.
Also Read: Gold Price Today 14 April 2021: బులియన్ మార్కెట్‌లో మళ్లీ దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
Light to moderate rainfall over the city to continue for the next couple of hours.
Citizens may dial 040-29555500 for DRF assistance. #Hyderabadrains pic.twitter.com/xjW1xSsEor
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) April 14, 2021
కొన్ని జిల్లాల్లో దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ అక్కడక్కడా వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శనివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. రేపటి నుంచి తెలంగాణ(Telangana)లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఉమ్మండి నల్గొండ, ఉమ్మండి ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.
Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 14, 2021, ఓ రాశివారికి వాహనయోగం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook