హైదరాబాద్‌లో పలు చోట్ల కుండపోత వర్షం

హైదరాబాద్‌లో పలు చోట్ల కుండపోత వర్షం

Last Updated : Jun 23, 2019, 05:10 PM IST
హైదరాబాద్‌లో పలు చోట్ల కుండపోత వర్షం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్‌, తార్నాక, హబ్సిగూడ, నాచారం, ఉప్పల్, బోడుప్పల్, మల్లాపూర్‌, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, కోంప‌ల్లి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగర శివార్లలోని చేవెళ్ల, శంషాబాద్‌, షాబాద్‌ మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. 

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనికితోడు రాజస్థాన్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది. మరోవైపు చత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Trending News