Hyderabad Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. వరదలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Hyderabad Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. వరదలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని రామంతపూర్ లో అత్యధికంగా 71 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. మాదాపూర్ లో 5.4 సెంటీమీటర్లు, డబిర్ పురా లో 5.1 సెంటీమీటర్లు, బండ్లగూడలో 4.7 సెంటీమీటర్లు, హఫీజ్ పేటలో 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సీతాఫల్ మండిలో 4.5 సెంటీమీటర్లు, చార్మినార్ లో 4.4 సెంటీమీటర్లు, నారాయణగూడ , హబ్సిగూడలో 4.2 సెంటీమీటర్లు, అంబర్ పేట, ,శ్రీనగర్ కాలనీ, నాంపల్లి, ముషీరాబాద్ లో 4.1 సెంటీమీటర్ల వాన కురిసింది. సికింద్రాబాద్ మొండా మార్కెట్ , ఖైరతాబాద్ లో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.