Samajwadi MP shocking comments over raising marriage age of women:సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు మహిళల వివాహ వయసు పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఒకరు మహిళల వివాహ వయసును ఫర్టిలిటీతో ముడిపెట్టగా.. మరొకరు పేదరికంతో ముడిపెట్టారు. ఈ ఇద్దరి కామెంట్స్‌పై స్పందించేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ నిరాకరించారు.
South Coast Railway Zone: ఆంధ్రప్రదేశ్ కు మంజూరు చేసిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటులో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని పార్లమెంట్ లో తెలుగు దేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2019లో సార్వత్రిక ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కొత్త జోన్ ఏర్పాటుపై ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదని గళమెత్తారు.
Parliament Fire Today: ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో బుధవారం ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. తక్షణమే స్పందించిన అగ్ని మాపక సిబ్బంది.. పరిస్థితి వెంటనే అదుపులోకి తీసుకొచ్చారు.
Revanth Reddy: యాసంగి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయమంటోందని... కాబట్టి యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకూడదా అని ప్రశ్నించారు.
Rajya Sabha MP Suspension: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే 12 మంది సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ ఏడాది జరిగిన వర్షాకాల సమావేశాల్లో హింసాత్మకంగా ప్రవర్తించిన 12 మంది ప్రతిపక్ష ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసే వరకు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్లమెంట్ ఓ ప్రకటన చేసింది.
PM Modi On Omicron: ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందు మీడియాతో మాట్లాడిన మోదీ.. సాగు చట్టాల రద్దు బిల్లు, పీఎం గరీబ్ కల్యాణ్ యోజన పథకం గురించి మాట్లాడారు.
Farm Laws Repeal Bill: సాగు చట్టాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందుడుగేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ నేడు భేటీ అయింది. 'వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021'కు ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
PM Modi to Chair All party Meeting: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగే అవకాశం ఉంది. సాగు చట్టాల రద్దు అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.