PM Modi On Omicron: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో ప్రధాని మోదీ ఈ విధంగా మాట్లాడారు.
“కరోనా వ్యాప్తి నేపథ్యంలో 100 కోట్లకు పైగా కొవిడ్ వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించాం. ఇప్పుడు మరో 150 కోట్ల కొవిడ్ డోసులు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో మనం మరింత అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజల ఆరోగ్యం మా మొదటి ప్రాధాన్యత” అని ప్రధాని మోదీ అన్నారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు సీనియర్ కేబినెట్ మంత్రులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్రహోం మంత్రి అమిత్‌షా, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్యశాఖ మంత్రి పీయుష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంతి ప్రహ్లాద్ జోషీ.. పాల్గొన్నారు.
సాగు చట్టాల రద్దు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని పొడిగించేందుకు క్యాబినేట్ నిర్ణయించింది. ఈ బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు.
ఉచిత రేషన్ పొడిగింపు..
దేశంలోని పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించే 'ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన' పథకాన్ని 2022 మార్చి వరకు పొడిగించినట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ నిర్ణయంతో 80 కోట్లమంది పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
Also Read: Bihar Pocso Court: అత్యాచార కేసులో ఒక్క రోజులోనే తీర్పు-బిహార్ పోక్సో కోర్టు రికార్డ్...
Also Read: Farm Laws Repeal Bill 2021: నూతన సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook