South Coast Railway Zone: దక్షిణకోస్తా రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2019 ఫిబ్రవరిలో కేంద్రం హామీ ఇచ్చిన కొత్త జోన్ ఏర్పాటుపై ఇప్పటికీ పురోగతిలేదని లోక్‌సభలో గళమెత్తారు. మూడేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవచూపడంలేదని మండిపడ్డారు.
2021-22 బడ్జెట్‌లో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు కేవలం రూ.40 లక్షలు మాత్రమే కేటాయించారు.. ఆ డబ్బుతో భవనం నిర్మించడమే కష్టమన్నారు. ఇంత తక్కువ కేటాయించడం రాష్ట్రాన్ని అవమానించడమేనన్నారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న రైల్వే జోన్ల జాబితాలో గానీ, కొత్తగా ఏర్పాటు చేయబోయే జోన్ల జాబితాలో గానీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశాన్ని కేంద్రం చేర్చలేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఈ రెండు జాబితాలోనూ లేకపోవడంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలన్నారు.
రైల్వే జోన్ ఏర్పాటు, ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో చెప్పాలని, ఏపీ ప్రజల తరఫున మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరఫున కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంటనే రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ALso Read: PRC Review: పీఆర్‌సీపై ఆర్ధికశాఖ అధికారులతో వైఎస్ జగన్ సమీక్ష, కీలక నిర్ణయం
Also Read: Helicopter Crash: చిట్టితల్లిని చూడాలనుంది..వీలు కుదిరితే సాయంత్రం చేస్తాను
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook