Parliament Fire Today: ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో బుధవారం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. శీతాకాల సమావేశాలు జరుగుతున్న తరుణంలో పార్లమెంట్ లోని ఓ గదిలో అగ్ని ప్రమాదం జరగ్గా.. తక్షణమే స్పందించిన అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
పార్లమెంట్ భవనంలోని రూమ్ నంబరు 59 వద్ద బుధవారం ఉదయం 8 గంటలకు ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయితే రంగంలోకి దిగిన అగ్ని మాపక సిబ్బంది పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కానీ, ఆ లోపే అందులో ఉన్న కుర్చీలు, బల్లలు సహా కంప్యూటర్లు దగ్ధమ్యాయని అధికారులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి కారణం తెలియరాలేదని పార్లమెంట్ కు చెందిన ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు.
పార్లమెంటులో ఇలాంటి అగ్నిప్రమాదాలు జరిగితే అరికట్టడానికి ఎల్లప్పుడూ అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంటుందని సదరు అధికారి వివరించారు. బుధవారం ఉదయం ప్రమాద సమాచారం తెలుసున్న వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి మంటలు అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా.. నవంబరు 29 నుంచి డిసెంబరు 23 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.
Also Read: Karnataka: బీజేపీ ఎమ్మెల్యే హత్యకు డీల్-సంచలనం రేపుతోన్న కాంగ్రెస్ నేత వీడియో
Also Read: Mark Zuckerberg case : ఫేస్‌బుక్‌లో పోస్ట్‌పై జుకర్‌బర్గ్ పై కేసు, అఖిలేష్ అభిమాని చేసిన పని ఇది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook