Telangana Bypoll Elections Result 2022: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. మునుగోడులో మొత్తం 241805 ఓట్లర్లు ఉండగా.. 225192 మంది ఓటేశారు. మరో 658 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Munugode ByPoll: తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన మునుగోడు ఉప ఎన్నికలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం 93.5 శాతం పోలింగ్ జరిగింది. 2018 ఎన్నికల్లో 91.2 శాతం పోలింగ్ జరగగా.. ఈసారి క్రాస్ అయింది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా తీసుకుని శ్రమించడంతో ఓటింగ్ భారీగా నమోదైంది.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించాలని హైకోర్టులో అధికార పార్టీ పిటిషన్ వేసింది. ఎన్నికల కమిషన్ సింబల్స్ జాబితాలో కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తులు ఉన్నాయి. అయితే కారును పోలి ఉన్న ఈ గుర్తులతో తమకు నష్టం జరుగుతుందని టీఆర్ఎస్ భయపడుతోంది. గుర్తుల జాబితా నుంచి ఈ ఎనిమిది సింబల్స్ ను తొలగించాలని ఈనెల 10న ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేసింది.
Munugode Bypoll: కొన్ని నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకన్నా.. స్వతంత్ర అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ప్రధాన పార్టీల సింబల్ పోలిన గుర్తు రావడం వలనే వారికి భారీగా ఓట్లు వచ్చాయన్న వాదన ఉంది.
Munugode Bypoll: మునుగోడులో ప్రచారం తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. పోటాపోటీ ర్యాలీలతో గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంకులు స్పష్టిస్తున్నారు.
KTR COMMENTS: మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు మంత్రి కేటీఆర్. మునుగోడు నియోజకవర్గానికి మూడేళ్లుగా కోమటిరెడ్డి ఏం చేయలేదని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి అట్టర్ ప్లాప్ ఎమ్మెల్యే అన్నారు కేటీఆర్. 22 వేల కాంట్రాక్టు కోసమే ఆయన బీజేపీలో చేరారని మండిపడ్డారు.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన రోజే కారు పార్టీకి ఝలక్ ఇచ్చారు సీనియర్ నేత. రాత్రికి రాత్రే జంప్ కొట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కమలం గూటికి చేరారు మునుగోడు నియోజకవర్గ సీనియర్ నాయకులు, చండూరు జడ్పిటిసి సభ్యులు కర్నాటి వెంకటేశం. అతనితో పాటు గట్టుప్పల్ ఎంపీటీసీ అవ్వారి గీతా శ్రీనివాస్, ఉడుతలపల్లి ఉప సర్పంచ్ గంట తులసయ్య బీజేపీలో చేరారు
Munugode Bypoll: మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మునుగోడుకు సంబంధించి నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన రోజే కారు పార్టీకి ఝలక్ ఇచ్చారు సీనియర్ నేత. రాత్రికి రాత్రే జంప్ కొట్టారు.
Munugode Bypoll : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో జరగబోతున్న మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకం కానుంది. ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం ఉండనుంది. అందుకే ప్రధాన పార్టీలు బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ బలగాలను మొత్తం మునుగోడులోనే మోహరిస్తున్నాయి
Munugode Bypoll: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సంబంధం లేకుండా రాజేందర్ సమక్షంలో వివిధ పార్టీల నేతలు కషాయ కండువా కప్పుకుంటున్నారు. ఈ చేరికలే మునుగోడు బీజేపీలో వివాదానికి కారణమయ్యాయని తెలుస్తోంది. పాత, కొత్త నేతల మధ్య అప్పుడే కోల్డ్ వార్ మొదలైందని చెబుతున్నారు. స్థానికంగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు కూడా బీజేపీ లో చేరుతున్నారని.. అలాంటి వారితో పార్టీకి నష్టమని ముందు నుంచి బీజేపీలో ఉన్న నేతలు చెబుతున్నారు.
Munugode Byelection: ఉప ఎన్నిక జరగబోతున్న నల్గొండ జిల్లా మునుగోడు నియోజవర్గంలో రాజకీయంగా సంచనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో ముఖ్యనేతలను మోహరించింది అధికార టీఆర్ఎస్.తాజాగా హైదరాబాద్ వనస్థలిపురం లో చౌటుప్పల్ MPP తాడూరి వెంకటరెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది.
Munugode Byeelction:మునుగోడు నియోజకవర్గంలో అసమ్మతి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించినా అసమ్మతి నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.కూసుకుంట్ల టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని ప్రకటనలు చేస్తున్నారు.
Munugode Byeelction:మునుగోడు ఉప సమరంలో ఊహించని ట్విస్టులు నెలకొంటున్నాయి. అసమ్మతి గళంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆగమాగమవుోతంది.ఈనెల 20న మునుగోడులో సీఎం కేసీఆర్ సభ ఉండగా అసమ్మతి నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో మునుగోడు విషయంలో సీఎం కేసీఆర్ ప్లాన్ మార్చారని అంటున్నారు.
Munugode Trs: మునుగోడు ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీలో సెగలు రేపుతోంది. అసమ్మతి నేతల వరుస సమావేశాలతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది.మునుగోడులో పరిస్థితి చేయి దాటి పోతుందని గ్రహించిన సీఎం కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.