Munugode Byelection: ఉప ఎన్నిక జరగబోతున్న నల్గొండ జిల్లా మునుగోడు నియోజవర్గంలో రాజకీయంగా సంచనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో ముఖ్యనేతలను మోహరించింది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఇతర పార్టీల నేతలను భారీగా పార్టీలో చేర్చుకుంటోంది. తాజాగా హైదరాబాద్ వనస్థలిపురం లో చౌటుప్పల్ MPP తాడూరి వెంకటరెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. తంగిరిళ్ళ మూడవ అంతస్తులో నివాసం ఉంటున్నారు వెంకట్ రెడ్డి. చౌటుప్పల్ SOT,CCS పోలీసులు తంగిరిళ్ళని చుట్టు ముట్టారు.
చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారని అతని అనుచరులు చెబుతున్నారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారన్న సమాచారంతోనే అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీ మారుతున్న విషయం తెలుసుకుని పోలీసులతో తనను మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని తాడురి వెంకట్ రెడ్డి ఆరోపించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీగా తాడూరి నివాసానికి చేరుకుంటున్నారు. కొన్ని రోజులుగా మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ లో అసమ్మతి గళం వినిపిస్తున్నారు తాడూరి వెంకట్ రెడ్డి. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. మునుగోడు టీఆర్ఎస్ నేతలు ఇటీవలే చౌటుప్పల్ సమీపంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దాదాపు 300 మంది నేతలు హాజరయ్యారు. తాడూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలోనే అసమ్మతి నేతల సమావేశం జరిగిందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాడూరి వెంకట్ రెడ్డి అరెస్ట్ కు పోలీసులు ప్రయత్నించడం దుమారం రేపుతోంది.
2009లో పీఆర్పీ నుంచి మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు తాడూరి వెంకట్ రెడ్డి. తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2019లో కాంగ్రెస్ నుంచే ఎంపీటీసీగా గెలిచి చౌటుప్పల్ ఎంపీపీ అయ్యారు. అయితే కొంతా కాలానికే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో విభేదాలు రావడంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరారు. గత ఏడాదిగా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో ఆయనకు వార్ సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక టికెట్ కూసుకుంట్లకు రాకుండా చేసేందుకు ప్రయత్నించారు. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి దగ్గర తన వాయిస్ గట్టిగా వినిపించారు. ఇటీవలే పార్టీ పెద్దలు ప్రగతిభవన్ కు పిలిపించుకుని మాట్లాడారు. అయినా వెనక్కి తగ్గలేదు తాడూరి వెంకట్ రెడ్డి. మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పినా కూసుకుంట్లకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. తాజాగా ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో టచ్ లోకి వెళ్లారంటున్నారు. దీంతో పార్టీ మారుతున్నారనే కారణంతోనే తాడూరిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని అతని అనుచరులు చెబుతున్నారు.
సోమవారం చౌటుప్పల్ లో మీడియా సమావేశం పెట్టిన ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తనను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టార్గెట్ చేశారని, తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కూసుకుంట్ల ప్రభాకర్ కి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించినందుకే తనపై అసత్య ఆరోపణలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. తన సొంత గ్రామ రైతులను రెచ్చగొట్టి.. తనపై ఉసిగొల్పుతున్నాడని తెలిపారు. పోలీసుల చేత వార్నింగ్ లు ఇప్పిస్తున్నాడని చెప్పారు. కూసుకుంట్ల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు.
Also read:AP Rajbhavan: ఏపీ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం..దూరం దూరంగా జగన్, చంద్రబాబు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook