Munugode Bypoll: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అక్టోబర్ చివరలో బైపోల్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. తాజాగా మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మునుగోడుకు సంబంధించి నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన రోజే కారు పార్టీకి ఝలక్ ఇచ్చారు సీనియర్ నేత. రాత్రికి రాత్రే జంప్ కొట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కమలం గూటికి చేరారు మునుగోడు నియోజకవర్గ సీనియర్ నాయకులు, చండూరు జడ్పిటిసి సభ్యులు కర్నాటి వెంకటేశం. అతనితో పాటుగట్టుప్పల్ ఎంపీటీసీ అవ్వారి గీతా శ్రీనివాస్, ఉడుతలపల్లి ఉప సర్పంచ్ గంట తులసయ్య బీజేపీలో చేరారు. కర్నాటి వెంకటేశంతో పాటు వందలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు.
చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం బీజేపీలో జాయిన్ కావడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఆయన యాక్టివ్ గానే తిరుగుతున్నారు. చండూరు మండలానికి చెందిన కొందరు నేతలను పార్టీలో కూడా చేర్చించారు. ఇంతలోనే ఆయన పార్టీ మారడం చర్చగా మారింది. మంత్రి జగదీశ్ రెడ్డి తీరు వల్లే జడ్పీటీసీ పార్టీ మారారనే ప్రచారం సాగుతోంది. మునుగోడు నియోజకవర్గంలో బీసీ లీడర్లను మంత్రి నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి. పార్టీ సమావేశాలకు కూడా బీసీ లీడర్లను ఆహ్వానించడం లేదని తెలుస్తోంది. నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉంది. 67 శాతం ఓటర్లున్న బీసీకీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. కాని జగదీశ్ రెడ్డి మాత్రం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు. వాళ్లిద్దరే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ అత్మీయ సమావేశాల్లో బీసీ నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారని అంటున్నారు.
మరోవైపు నియోజకవర్గంలోని నేతల నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై వ్యతిరేకత ఉంది. అతనికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని కొందరు నేతలు ఓపెన్ గానే చెప్పారు. అసమ్మతి ఎక్కువగా ఉండటం వల్లే మునుగోడు సభలో అభ్యర్థి పేరును కేసీఆర్ ప్రకటించలేదని తెలుస్తోంది. అయితే మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం కూసుకుంట్లే అభ్యర్థి అని చెబుతున్నారని అంటున్నారు. తాజాగా మంగళవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మునుగోడుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి బీసీ నేతలకు ఆహ్వానం అందలేదు. మంత్రి జగదీశ్ రెడ్డి వల్లే బీసీ లీడర్లకు ప్రగతి భవన్ నుంచి పిలుపు రాలేదంటున్నారు. మంగళవారం సీఎం సమావేశం తర్వాత కూసుకుంట్లకే టికెట్ అనే వార్తలు వచ్చాయి. దీంతో బీసీ లీడర్లు తమ దారి తాము చూసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కూసుకుంట్ల పేరును అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తే మరికొందరు కీలక నేతలు కారు పార్టీకి హ్యాండివ్వడం ఖాయమని తెలుస్తోంది.
Also read: IND vs AUS: ఆకాశమే హద్దుగా చెలరేగిన గ్రీన్, వేడ్.. తొలి టీ20లో టీమిండియా ఓటమి!
Also read: Aadhaar Card Download: రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ ఎలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook