Teenmar Mallanna Arrest : తీన్మార్ మల్లన్న అరెస్ట్‌ను బండి సంజయ్ ఖండించాడు. కేసీఆర్ నీకు మూడిందంటూ ఫైర్ అయ్యాడు. దొంగల్లా వచ్చి పోలీసులు మల్లన్నను ఎత్తుకుపోతారా? అంటూ నిలదీశాడు.
Teenmaar Mallanna Wife : ప్రభుత్వం చేస్తోన్న పనులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుడటం, విమర్శలు చేస్తుండటంతోనే ఇలా అరెస్ట్ చేశారని, ఆయనకు ఏం జరిగినా కేసీఆర్‌దే బాధ్యత అని మల్లన్న భార్య చెప్పుకొచ్చింది.
TPCC Chief Revanth Reddy: చంద్రబాబు నాయుడు ఆనాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని 51% ప్రయివేటుపరం చేస్తుంటే అడ్డం పడ్డాను అని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదే ఫ్యాక్టరీని మూసేస్తే పోచారం ఏం చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
BRS government : బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇంటా బయట సమస్యలతో బీఆర్ఎస్ సతమతమవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఇప్పుడు బీఆర్ఎస్ చిక్కుల్లో పడేట్టుంది.
Revanth Reddy Slams KTR: బోధన్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ కులాలు, మతం పేరుతో ప్రజలను విభజించి పాలించాలని చూస్తున్నారు అని మండిపడ్డారు.
Bandi Sanjay Satires on Kavitha and KTR: కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదు. పార్లమెంటులో మహిళా బిల్లు కాపీలను చించిపారేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలను వెంటేసుకుని మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం సిగ్గు చేటు అని అన్నారు.
Revanth Reddy Karimnagar Speech: 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి 2004 లో ఇదే గడ్డపై నుంచి తెలంగాణ ఇస్తామని తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ మాట ఇచ్చారు. మాట తప్పక మడమ తిప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
Fake Birth Certificates In Hyderabad: కేసీఆర్ పాలనలో పాత బస్తీ ఐఎస్ఐ ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. అడుగడుగునా స్లీపర్ సెల్స్‌ని పెంచి పోషిస్తున్నారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా, ఉగ్రదాడులు జరిగినా.. వాటి మూలాలు పాతబస్తీలోనే బయటపడుతున్నాయి. అయినప్పటికీ కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం లేదు అని బండి సంజయ్ మండిపడ్డారు.
Bandi Sanjay Allegations on Preethi Death Case: ఒక వర్గానికి చెందిన నిందితుడికి కొమ్ముకాస్తున్నారని.. అందుకే ప్రీతి మృతి విషయంలో వాస్తవాలు వెలుగులోకి రాకుండా ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు బెదిరించారు అని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రీతి చనిపోయిన తరువాత పోలీసులు ఆమె మొబైల్ అన్‌లాక్ చేసి ఆధారాలను మాయం చేశారని బండి సంజయ్ ఆరోపించారు.
Revanth Reddy Slams KCR : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు 40 ఏళ్ల కింద ఇక్కడ లగ్గం అయిందని చెప్పిండు. అప్పట్లో ఆయనకు ఇక్కడ లగ్గం అయిందో లేదో తెలియదు కానీ... వేములవాడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆయన లగ్గం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు " అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Dr Preethi Case : డాక్టర్ ప్రీతి మృతి పట్ల ప్రభుత్వం సీరియస్ యాక్షన్‌కు దిగింది. హెచ్ఓడీ నాగార్జున రెడ్డిని బదిలీ చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.