జనసేన పార్టీ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ముమ్మరం చేస్తోంది. ఇప్పటి వరకు ఈ పార్టీలో 17 లక్షల మంది సభ్యులు చేరారని అంచనా. తాజాగా మరింతమంది సభ్యులను చేర్చుకోవడం కోసం యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు.
ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి తనకు ఒక విషయమైతే కచ్చితంగా అవగతమైందని.. అమిత్ షా లేఖలో రాసిన అంశాలను బట్టి.. దానికి ప్రతిగా చంద్రబాబు చెప్పిన
సమాధానాలు బట్టి చూస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే సూచనలు కనిపించడం లేదని అర్థమవుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఊసరవెళ్లి బొమ్మ పెట్టి.. వివిధ సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలను చూపెడుతూ ఫేస్బుక్లో షేర్ అవుతున్న ఓ పోస్టును నిన్నే క్రిటిక్ కత్తి మహేష్ తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు.
ప్రత్యేక హోదా బదులు రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు.
అమరావతి ప్రాంతంలో తన ఇంటి శంకుస్థాపన కార్యక్రమానికి పలువురు ముఖ్యమైన జనసేన నాయకులతో పాటు తన సతీమణితో విచ్చేసిన పవన్ కళ్యాణ్ అక్కడే మీడియా సమావేశం నిర్వహించారు.
జనసేన ఆధ్వర్యంలో నియమించిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (నిజనిర్థారణ కమిటీ) సమావేశాలకు వచ్చిన కార్యకర్తలు, మిగతా పార్టీల ప్రతినిధులు, మీడియా సంస్థల ప్రతినిధులు అందరికీ జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణలో తన ప్రజా యాత్రను ప్రారంభించిన సినీనటుడు, జనసేన పార్టీ అధినేతకు మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌ల నుంచి మెగా సపోర్ట్ లభించింది. పవర్ స్టార్ వెంటే మేము అంటూ బాబాయ్‌కి, అంకుల్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ మెగా హీరోలు ట్విటర్ ద్వారా తమ మద్దతు తెలియజేశారు.
సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరిచర్చికి తన సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
జనసేన పార్టీలో చేరే వ్యక్తులు సభ్యత్వం తీసుకొనేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లాంఛనంగా ప్రారంభించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.