ఊసరవెళ్లి సాధారణంగా ఏం చేస్తుంది. రంగులు మారుస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అలా ఊసరవెళ్లి బొమ్మ పెట్టి.. వివిధ సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలను చూపెడుతూ ఫేస్బుక్లో షేర్ అవుతున్న ఓ పోస్టును నిన్నే క్రిటిక్ కత్తి మహేష్ తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు. మార్పు మంచిదే...కానీ మరీ ఇంత మార్పు అయితే ఉతికేస్తారు. జాగ్రత్త! అని ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి పేర్కొన్నారు.
"చంద్రబాబునాయుడు ఊసరవెల్లి రాజకీయాలు" పేరుతో ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతకు ముందే కత్తి మహేష్ దళితులు, రాజ్యాధికారం అనే పోస్టును ఫేస్బుక్లో రాశారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కులాధారిత సామాజిక పునాదుల మీద ఏర్పడిన ఆర్ధిక బలిమికి అల్టిమేట్ రిజల్టుగానే కనిపిస్తోందని తెలిపారు.
తొలుత రెడ్లు(కాంగ్రెస్, వైసిపి), తరువాత కమ్మలు (తెలుగుదేశం) రాజ్యాధికారంలో ఉండగా.. ఇప్పుడు కాపులు (జనసేన) కూడా రాజ్యాధికారం పోరులో ముందున్నారని చెబుతూ ఆయన జనసేన పార్టీని కూడా విమర్శించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుచూపుతో కల్పించిన రాజకీయ రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, దళితులు అధికారం దిశగా డిసైసివ్ అడుగులు వేసిన దాఖలాలు ఆంధ్రప్రదేశ్లో కనిపించవని కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు.