పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి మంచి చేయాలనే చూస్తున్నారు: చంద్రబాబు

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి మంచి చేయాలనే చూస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 

Last Updated : Feb 15, 2018, 09:21 PM IST
పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి మంచి చేయాలనే చూస్తున్నారు: చంద్రబాబు

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి మంచి చేయాలనే చూస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీతో టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. పవన్ పోరాటంలో కొంత అర్థం ఉందని.. ఆయన ఏపీకి మంచి చేయడానికి ఈ కార్యం తలపెట్టారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

టీడీపీ కూడా రాష్ట్రానికి మంచి జరగాలనే యోచిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రం ఎప్పుడు ఏమేమి ఖర్చులు చేసిందో సమాచార హక్కు చట్టం ప్రకారం తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. కాకపోతే కేంద్రం ఏం చేసిందనే అంశంపై భారతీయ జనతా పార్టీ కూడా వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.

ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రానికి ఎంత మంజూరు చేసిందనే విషయాన్ని భాజాపా నాయకులు లెక్కలతో సహా చెబితే తనకు అభ్యంతరం లేదన్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. తాను తనదైన శైలిలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని.. దీనిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబు తెలిపారు.

Trending News