'కరోనా వైరస్' కారణంగా ..దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 3 వేల 700 రైళ్లు రద్దు చేశారు. ఏకంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయడం ఇదే తొలిసారి. దీంతో రైల్వే కోచ్ లు మొత్తం ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.
కరోనావైరస్ (COVID-19) దాడి తీవ్రరూపం దాలిస్తే.. ఆ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరిన్ని క్వారంటైన్ సేవలు (Quarantine) అందించేందుకు 20,000 రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా తీర్చిదిద్దాలని భారతీయ రైల్వే (Indian Railways) నిర్ణయించుకుంది.
కోవిడ్-19 పాజిటివ్‌తో (COVID-19 positive) బాధపడుతున్న పలువురు రైళ్లలో ప్రయాణిస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. రైలులో ప్రయాణించిన వారికి కరోనావైరస్ ఉందని తెలిసిన అనంతరం రైల్వే శాఖ ట్విటర్ (Indian Railways twitter) ద్వారా రైలు ప్రయాణికులకు (Train passengers) ఓ విజ్ఞప్తి చేసింది.
కరోనా వైరస్ (Coronavirus) బారిన పడకుండా ఉండేందుకు మార్చి 22 ఆదివారం నాడు దేశంలోని ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ (Janata curfew) పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ అమలులో ఉండనుంది.
రైలులో దూర ప్రయాణం చేయాలంటే బెర్త్ కన్ఫర్మ్ అయిన టికెట్ తప్పనిసరి. లేదంటే ప్రయాణంలో చుక్కలు కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు అత్యవసర ప్రయాణాలు పడినప్పుడు ఏదేమైనా వెళ్లకతప్పని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడే అందరికీ గుర్తొచ్చేది ఐఆర్సిటీసి ( IRCTC )లోని తత్కాల్ టికెట్ బుకింగ్ (Tatkal ticket booking).
రైలులో బంధువులను లేదా కుటుంబ సభ్యులను ఎక్కించడానికి వెళ్తున్నప్పుడు.. ప్రయాణం చేయని వారు ప్లాట్ ఫారమ్ టికెట్ కొనడం తప్పనిసరి. గతంలో మూడు, నాలుగు, ఐదు రూపాయలు ఉన్న ప్లాట్ ఫారమ్ టికెట్ ఇప్పుడు 10 రూపాయలకు చేరుకుంది.
సమాచార హక్కు చట్టం కింద ఓ ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే అధికారులు ఈ వివరణ ఇచ్చారు. 2014 నుంచి ఇంత భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయడం ఇదే తొలిసారి.
భారతీయ రైల్వే సరికొత్త ఆలోచనతో రామాయణ ఎక్స్‌ప్రెస్ పేరుతో మరో కొత్త రైలును ప్రవేశపెట్టబోతోంది. ఇందులో ప్రయాణించేవారికి రామాయణ కాలం గుర్తొచ్చే విధంగా భక్తి పారవశ్యంతో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రైలు బోగీల లోపల రామాయణ కావ్యానికి ప్రతీక అనే విధంగా అలంకరణ ఉంటుందని, భజనలు వినిపిస్తాయని సీనియర్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు.
గతేడాది టికెట్ లేకుండా ప్రయాణించిన ప్రయాణికుల వద్ద నుంచి ఓ టీసీ రికార్డు స్థాయిలో రూ.1.51 కోట్ల జరిమానా వసూలు చేశాడు. మరో ముగ్గురు టీసీలు కోటి రూపాయలకు పైగా జరిమానాల నగదు రైల్వేశాఖకు అందించారు.
రైళ్లలో కంటెంట్ ఆన్ డిమాండ్ (కాడ్) సేవలను అందించడానికి రైల్‌టెల్ కార్పొరేషన్ సన్నద్ధమవుతుండటంతో రైలు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో నిరంతరాయంగా సినిమాలు, సంగీతం, ప్రదర్శనలు మరియు వివిధ వినోద కార్యక్రమాలను ఆస్వాదించవచ్చని భారతీయ రైల్వే అధికారులు తెలిపారు.
ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు ప్రభావం ఉత్తర రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీకి బయల్దేరి, ఉత్తర రైల్వే పరిధిలోకి ప్రవేశించిన 15 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది.
దేశంలో ఎన్డీయే సర్కార్ తీసుకొస్తున్న విధానాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని నిరసన వ్యక్తంచేస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా ప్రశాంతంగానే కొనసాగుతున్నప్పటికీ.. పశ్చిమ బెంగాల్లో ఒకట్రెండు చోట్ల చెదురుముదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.